టీడీపీ మంత్రి అక్ర‌మాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-09-07 01:07:28

టీడీపీ మంత్రి అక్ర‌మాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన టీడీపీ ఎమ్మెల్యే

బ‌న‌గాన‌ప‌ల్లి మైనింగ్ బ్లాస్టింగ్ సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. మైనింగ్ అక్ర‌మాల‌పై మంత్రి సుజ‌య‌ కృష్ణ‌ను స‌భ‌లోనే నిల‌దీశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి. మైనింగ్ ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌డం లేద‌న‌డాన్ని త‌ప్పుప‌ట్టారు ఆయ‌న. మైనింగ్ శాఖ‌లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై క‌మిటీ వెయ్యాల‌ని బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. 
 
కొద్దికాలంగా సిమెంట్ కంపెనీలు ఇష్టా రాజ్యంగా నిబంధ‌న‌లను ఉ్గల్లంగిస్తున్నా పోలీసులు, ప్ర‌భుత్వ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. రోడ్ల‌కు 150 మీట‌ర్ల‌కు దూరంలో  మైనింగ్ ఉండాల‌న్న నిభంద‌న అమ‌లు కావ‌డంలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం వెంట‌నే క‌మిటీ వేసి విచార‌ణ జ‌రిపిస్తే మైనింగ్ సంబంధించి అస‌లు వాస్తవాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని జ‌నార్ధ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.
 
విచార‌ణ జ‌రిపిస్తే త‌న వ‌ద్ద సాక్షాలు ఉన్నాయ‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక సొం త‌పార్టీ నాయ‌కుడు అక్ర‌మాల‌పై నిల‌దీయ‌డంతో ఖంగుతిన్న మంత్రి సుజ‌య‌ కృష్ణ మైనింగ్ బ‌ద్ర‌త త‌న ప‌రిధిలో రాద‌ని త‌ప్పించుకున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.