మంత్రి లోకేశ్ ను ఆద‌ర్శంగా తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-17 12:11:24

మంత్రి లోకేశ్ ను ఆద‌ర్శంగా తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు

విశాఖ న‌గ‌రంలోని కొన్నిప్రాంతాల‌తో పాటు మ‌రికొన్ని గ్రామాల‌తో క‌లిసి ఏర్ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం పెందుర్తి. అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఓట్ల సంఖ్య 2 ల‌క్ష‌ల 32 వేల 873 ఓట్లు ఉండ‌గా వీరిలో పురుషులు సంఖ్య 1 ల‌క్షా 17 వేల వ‌ర‌కు ఉంటే మ‌హిళా ఓట‌ర్లు 1 ల‌క్షా 15వేల వ‌ర‌కు ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విశాఖ సిటి పరిధిలోని దాదాపు ల‌క్ష‌మంది ఓట‌ర్లు ఉన్నారు. అటు సిటీ ఇటు గ్రామీణ‌ ఓట‌ర్ల‌తో క‌ల‌గ‌లిసిన‌ పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి టీడీపీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 
 
ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గండి బాబ్జీపై 18, వేల 648 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర‌వాడ‌, పెందుర్తి, స‌బ్బ‌వ‌రం మండ‌లాలు ఉన్నాయి. అలాగే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో హిందుజా ప‌వ‌ర్ ప్లాంట్ తో పాటు అనేక ప‌రిశ్ర‌మ‌ల‌తో కూడిన ఫార్మాసీటి కూడా ఉంది. సింహాజ‌ల దేవాల‌యంతో పాటు వేలాది ఎక‌రాల రైతు భూములు ప్ర‌భుత్వ భూములు ఈ సెగ్మంట్ లో ఉన్నాయి. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం ఎదుర్కున్న బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి 2014 ఎన్నికల్లో అన్నిర‌కాల హామీల‌ను ఇచ్చారు. ఫార్మాసిటి కాలుష్యం లేకుండా చేస్తామ‌ని ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు చాలా న‌మ్మ‌కంగా చెప్పారు. సింహాచ‌ల ఆల‌యాన్ని ఆనుకుని ఉన్న పంచ‌గ్రామాల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రిస్తాన‌ని అన్నారు.
 
విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్ప‌న్న‌కు వేల‌ ఎక‌రాల్లో భూములు ఉన్నాయి. గ‌తంలో అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు అక్ర‌మ మార్గాలు అనుస‌రించ‌డం వ‌ల్ల అప్ప‌న్న భూముల్లో పంచ‌గ్రామాలు విస్త‌రించాయి. అమాయ‌కులు అయిన ప్ర‌జ‌లు కొంత‌మంది సింహాచ‌ల‌ భూముల్లో ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో అడ‌వివ‌రం,వేప‌గుంటా చీమాల‌ప‌ల్లి, పురుషోత్త‌పురం, వెంక‌టాపూరం అనే గ్రామాల్లోని ప్ర‌జ‌లు ఎప్ప‌టినుంచో త‌మ గ్రామాల్లోని స్థలాల‌ను క్ర‌మ‌బ‌ద్దిక‌ర‌ణ చేయాల‌ని ప్ర‌భుత్వాల చుట్టూ తిరుగుతున్న ఫ‌లితం మాత్రం శూన్యం. 
 
2014 ఎన్నిక‌ల్లో పంచ‌గ్రామాల స‌మ‌స్య‌ల‌ను తీర్చేస్తాన‌ని చెప్పి ఈ గ్రామాల‌కు చెందిన వారితో ఓట్లు వేయించుకున్నారు ఇక్క‌డి ప్ర‌జా ప్ర‌తినిధులు. అంతేకాదు తాను ఎమ్మెల్యే అయిన త‌ర్వాత ఆరునెలల్లో ఈ స‌మ‌స్య‌ను తీర్చ‌క‌పోతే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పిన బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి చెప్పిన మాట‌ల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు గుర్తు చేస్తున్నారు. హిందూజా ప‌వ‌ర్ ప్లాంట్ లో స్థానికుల ఉద్యోగాల‌తో పాటు కాంట్రాక్ట్ లు అప్ప‌గిస్తామ‌ని బండారు చెప్పారు. 
 
అయితే ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను ప్ర‌జ‌లంద‌రు న‌మ్మేశారు, కానీ అందుకు భిన్నంగా బండారు వ్య‌వ‌హ‌రించారు. హిందుజా ఫ్యాక్ట‌రీ నిర్వాసితుల‌కు ఉద్యోగాలు రాక‌పోగా పెద్ద ఎత్తున చేతులు మారిన డ‌బ్బుల‌తో ఇత‌రుల‌కు ఉద్యోగాలు ల‌భించాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే అండ‌తో ఆయ‌న కుమారుడు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.
 
అక్ర‌మాలు అవినీతి అరోప‌ణ‌ల్లో బండారు పాల‌న అగ్ర‌స్థానంలో ఉంద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ద‌ళితులకు కేటాయించిన భూముల్లో ఎమ్మెల్యే అనుచ‌రులు ఇళ్ల నిర్మానానికి ప్ర‌య‌త్నించ‌గా వాటిని అడ్డుకున్న మ‌హిళ‌ను జ‌ర్రిపోతులు పాలెంలో విస్త్ర‌నుచేసి కొట్టిన ఘ‌ట‌న దేశంలోనే సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ విషయంలో జాతీయ ఎస్సీ క‌మీష‌న్ ప్ర‌భుత్వానికి చివాట్లు పెట్టింది. ఈ త‌ర‌హా నేరాల్లో పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం ముందున్న‌ట్లు జాతీయ‌స్థాయి నివేదిక‌ను వెళ్ల‌డించాయి. కానీ జ‌ర్రిపోతుల పాలెం బాదితుల‌కు న్యాయం జ‌రగ‌లేదు.
 
ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే భూస‌మీక‌ర‌ణాల పేరిట పెందుర్తి మండ‌లం ముద‌పాక‌లో పేద‌ల భూముల‌ను కొంద‌రు పెద్ద‌లు చేజిక్కించుకున్నార‌న్న వ్య‌వ‌హారం దేశంలోనే ఓ పెద్ద కుంభ‌కోణంగా మారింది. ఇక దీనిపై ప్ర‌భుత్వం వేసిన సిట్ విచార‌ణ పూర్తి అయింది. నిందితులంతా అధికార పార్టీ నాయ‌కులు కావ‌డంతో విష‌యం గోప్యంగా ఉంచిన‌ట్లు ప్ర‌తిక్ష నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
ఈ వ్య‌వ‌హారంలో కోట్ల రూపాయ‌లు చేతులు మారినట్లు భ‌హిరంగ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తామే హుదుహూద్ తుఫాను అడ్డుకున్నామ‌ని, బాదితుల‌ను ఆదుకున్నామ‌ని ఓ ప‌క్క చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పుకుంటుంటారు. అయితే అలాంటిది ఏమీ లేద‌ని హుదుహూద్ బాదితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌డంలోనూ ఇళ్ల‌ను క‌ట్టించ‌డంలో మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రించార‌ని వామ‌ప‌క్ష‌నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ఇక పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్డీపీసీ నుంచే వ‌చ్చే కాలుష్యం వ‌ల్ల దాదాపు ప‌ది ప‌న్నెండు గ్రామాల ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అంతేకాదు అనేక రోగాలు ఇక్క‌డి ప్ర‌జ‌లు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. ఈ రోగాల‌తో ప్ర‌జ‌లు ప్ర‌తీ ఏట ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్నారు. ఎన్డీపీసీ కాలుష్యం ఈ ప్రాతంలో మ‌హా ఘోరంగా త‌యారు అయి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతున్నా ఎమ్మెల్యేకు చీముకుట్టినట్టు కూడా లేద‌ని మండిప‌డుతున్నారు.
 
మరోవైపు బండారు పాల‌న‌లో అత‌ని త‌న‌యుడు అప్ప‌ల నాయుడు జోక్యం ఎక్కువ కావ‌డంతో అధికారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడిని అత‌ని త‌న‌యుడు లోకేశ్ బాబును ఆద‌ర్శంగా తీసుకుని పెందుర్తి ఎమ్మెల్యే ఆయ‌న కుమారుడు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.