ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-08-28 03:11:57

ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ

అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం 1952లో ఏర్ప‌డింది. 2009లో జ‌రిగి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఈ నియోజ‌క‌వ‌ర్గం స్వ‌రూపం మారిపోయింది. కొత్తగా గోరంట్ల, ప‌రిగి మండ‌లాలు పెనుకొండ‌లోకి యాడ్ అయ్యాయి. అంతేకాదు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గతంలో ప‌రిటాల ర‌వీంద్ర నాలుగు సార్లు ఎంపిక అయ్యారు. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ప‌రిటాల ర‌వీంద్ర స‌తీమ‌ని సునిత రాప్తాడుకు మారిపోయారు.
 
పెనుకొండ అసెంబ్లీ సెగ్మెంట్ వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2ల‌క్ష‌ల‌15వేల 79 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓట‌ర్లు 1 ల‌క్షా 28వేల 54 కాగా మ‌హిళా ఓట‌ర్లు 98 వేల 725మంది దాక ఉన్నారు. ఇక కులాల‌వారిగా ఓట‌ర్ల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే కురువ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు 55వేల నుంచి 60 వేల వ‌ర‌కు ఉన్నారు. ఇక బోయా లేక వాల్మీకి సామాజిక వ‌ర్గానికి చెందిన‌వి 45 వేల నుంచి 55 వేల దాక ఓట్లు ఉన్నాయి.
 
ఇక ఎస్సీల ఓట్లు 35వేల నుంచి 40 వేల దాక ఉంటే మైనార్టీలు 25 నుంచి 30 వేల దాక ఉన్నారు. మాజీ మంత్రి ప‌రిటాల అవీంద్ర అందండ‌లతో రాజ‌కీయంగా ఎదిగిన బీ.కే పార్థ‌సార‌ధి గ‌తంలో జ‌డ్పీటీసిగా, జ‌డ్పీచైర్మ‌న్ గా హిందూపురం పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ప‌నిచేశారు. అంతేకాదు రెండు సార్లు పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక‌య్యారు. ఇక నియోజ‌క‌వ‌ర్గాల్లో పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2009 ఎన్నిక‌ల్లో ప‌రిటాల కుటుంబం రాప్తాడుకు వెళ్లిపోవ‌డంతో బీకే పార్థ‌సార‌ధి పెనుకొండ‌లో పాగ వేశారు. 
 
అంతేకాదు టీటీడీ బోర్డు మెంబ‌ర్ గా కూడా ఉన్నారు. ఇక 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు ఇచ్చారు ఆయ‌న‌. గెలుపుకోసం ఆయ‌న అత్య‌ధికంగా కురువ బోయ‌ల‌ను ఆక‌ర్షించేందుకు అనేక విధాలుగా ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగానే బోయ‌ల‌ను టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఎస్టీలుగా మార్చుతామ‌ని కురువ‌ల‌ను ఎస్సీ జాభితాలో చేర్చుతామ‌ని హామీ ఇచ్చారు.  
 
అయితే పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు అయినా కూడా ఆయ‌న ప్ర‌క‌టించిన‌ హామీ నెర‌వేర్చ‌లేదు. పెనురొంకొండ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గోరంట్ల మేజ‌ర్ పంచాయితీ. ఈ గ్రామంలో తాగునీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. అయితే పార్థ‌సార‌ధి తాను ఎమ్మెల్యే అయ్యాక గ్రామ స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్క‌రిస్తాన‌ని ప‌దేప‌దే హామీ ఇచ్చారే కానీ అవి ఏవీ అమ‌లు కాలేదు. అంతేకాదు టీడీపీ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌తో వ‌ర్గ విభేదాలు ఉన్నాయి. 
 
ఎంపీ నిమ్మ‌ల కిష్టప్ప‌ది గోరంట్ల గ్రామం కావ‌డంతో ప్ర‌తీ ప‌నిలో ఇద్ద‌రి మ‌ధ్యా ఆదిప‌త్య‌పోరు న‌డుస్తోంది. వారిద్ద‌రి వ‌ర్గ పోరులో అమాయ‌క ప్ర‌జ‌లు న‌లిగిపోతున్నారు.పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ర‌వు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. రైతులు ఆత్మ‌హ‌త్య‌లు వ్య‌వ‌సాయ కూలీల వ‌ల‌స‌లు ఇక్క‌డ కొద్దికాలంగా స‌ర్వ‌సాధారణం అయ్యాయి.
 
అయితే ఇందుకోసం రొద్దం మండ‌లంలో స‌ర్ఫేజ్ డ్యామ్ ను నిర్మించి రైతుల‌ను ఆదుకుంటామంటూ ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి అనేక సార్లు హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న ఇప్ప‌టిదాక ఆప‌ని పూర్తి చెయ్య‌లేదు. దీంతో అక్క‌డ నివ‌సిస్తున్న‌టు వంటి ప్ర‌జ‌లు బ్ర‌తుకు దెరువుకోసం క‌ర్ణాట‌కు వ‌ల‌స‌లు వెళ్తున్నారు.  వాస్త‌వానికి పెనుకొండ నియోజ‌క‌వ‌కవ‌ర్గంలో చిత్రావ‌తి, పెన్నాన‌ది ప్ర‌వ‌హిస్తున్న త‌రుణంలో ఈ రెండు న‌దుల‌నుంచి అక్ర‌మంగా ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి ఇసుక‌ను బెంగుళురుకు త‌ర‌లిస్తున్న‌ర‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.