అనంత‌లో మ‌రో ఎమ్మెల్యే అల‌క‌ చంద్ర‌బాబు టెన్ష‌న్ టెన్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 15:05:43

అనంత‌లో మ‌రో ఎమ్మెల్యే అల‌క‌ చంద్ర‌బాబు టెన్ష‌న్ టెన్ష‌న్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వస్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బ‌లం, అలాగే ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల బ‌లం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుకూల మీడియా యాజ‌మాన్యం కొద్దిరోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వేను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వే ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ సూమారు 110 అసెంబ్లీ సీట్ల‌కు పైగా గెలుచుకుంటుంద‌ని, అలాగే ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 60 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని తెలిపింది.
 
అంతే కాదు విశాఖలో కీల‌క వ్య‌క్తి అయిన మంత్రి గంటా శ్రీనివాస రావు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి  బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని ఎల్లో మీడియా త‌న స‌ర్వే ద్వారా తెలిపింది. దీంతో మంత్రి గంటా శ్రీనివాస‌రావు పార్టీకి మూడు రోజుల పాటు దూరంగా ఉంటూ వ‌చ్చారు.కాగా మొన్న జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశానికి కూడా గంటా హాజ‌రు కాలేదు. 
 
త‌న‌పై టీడీపీ ఆధిష్టానం కావాల‌నే ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తున్నార‌ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై గంటా గుర్రుగా ఉన్నారు. ఇక నిన్న సీఎం విశాఖలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి ఖ‌చ్చితంగా హాజ‌రు కావాల‌ని హోమంత్రి చినరాజ‌ప్ప ప్ర‌త్యేకంగా గంటాతో స‌మావేశం అయి ఆయ‌న‌ను బుజ్జ‌గించారు. దీంతో గంటా కాస్త చ‌ల్ల‌బ‌డ్డారు.
 
గంటా అల‌క‌కు పూర్తి ప‌రిష్కారం దొరికి 24 గంట‌లు గ‌డవ‌క ముందే టీడీపీకి చెందిన మ‌రో లేడీ ఎమ్మెల్యే అల‌క చెందిన‌ట్లు స‌మాచారం. కొద్దిరోజుల క్రితం అనంత‌పురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో ఏపీఎస్సీ 14వ బెటాలియన్‌ను నూతన భవనం ప్రారంభోత్సవం జరిగిన‌ సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ప్రారంభోత్స‌వానికి హోంమంత్రి చినరాజప్ప ముఖ్యఅతిధిగా హాజ‌ర‌య్యారు. 
 
ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లాలో ఉన్న ప్ర‌తీ ఒక్క టీడీపీ ఎమ్మెల్యేల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఆహ్వానం అందించారు, కానీ స్థానికి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన యామినిబాల‌కు ఆహ్వానం అందలేదు. దీంతో మూడు రోజులుగా టీడీపీ అదిష్టానంపై ఆమె అల‌క‌గా ఉన్నార‌ట‌. ఇక జిల్లాకు చెందిన సీనియ‌ర్లు అంద‌రు ఎమ్మెల్యే యామిని బాల‌కు స‌ర్దిచెబుతామ‌ని చూశారు కాని అది కుద‌ర‌లేదు. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అని, త‌న‌పై చుల‌క‌నా అని ఆమె ప్రశ్నిస్తున్నార‌ట‌. అయితే దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ధానిక ఎమ్మెల్యేని పిలువకుండా ప్రోటోకాల్ పాటించ‌కుండా ఎలా ప‌నులు చేస్తార‌ని ఆమె ఫైర్ అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.