చంద్ర‌బాబు పై టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు విమ‌ర్శ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-04 18:19:56

చంద్ర‌బాబు పై టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు విమ‌ర్శ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 2019 ఎన్నిక‌ల హీట్ పెరిగిపోతుంది. ప్ర‌ధాన పార్టీల‌న్ని రోడ్డు ఎక్కి వివిధ వ‌ర్గాల‌ను, ప్ర‌జ‌లను ఆక‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డాయి. ఇక ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా జ‌నంలో తిరుగుతున్నారు. తాను ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఏ విధంగా రాష్ట్రం అభివృద్ది చెందిందో వాటి గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు సిద్ద‌మ‌య్యారు. అందులో భాగంగా ఒక రోజు అమ‌రావ‌తిలో ఉంటే మ‌రో రెండు రోజులు జిల్లాల‌లో తిరిగే విధంగా ప్ర‌ణాళిక‌ను సిద్దం చేసుకుంటున్నారు. 
 
అంతేకాదు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భారీ భ‌హిరంగ స‌భ‌ల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ స‌భ‌ల్లో ఆయ‌న ఒకే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతున్నారు. కేంద్రం నుంచి త‌మ‌కు ఎన్ని ఇబ్బందులు ఎదురు అవుతున్నా రాష్ట్రం ఈ స్థాయిలో అయినా అభివృద్ది చెందింది అంటే దానికి కార‌ణం అధికారులే అంటూ ఊద‌ర‌కొట్టేస్తున్నారు. ముఖ్య‌మంత్రి భావ‌న ఎలా ఉన్నా అధికార‌ టీడీపీ నాయ‌కులు ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలలో మాత్రం ఆ భావ‌న వ్య‌క్తం కావ‌డం లేదు. 
 
అధికారుల గురించి త‌మ నేత గొప్ప‌గా చెబుతున్నా వారి ప‌నితీరు మాత్రం ఆ స్థాయిలో లేదంటున్నారు స‌ద‌రు నాయ‌కులు. పైగా ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో బెదిస్తున్నారంటూ అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  అయితే కొన్ని సంద‌ర్బాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినా కూడా వారిలో మార్పు రాక‌పోవ‌డంతో ఏం చెయ్యాలో అర్థం కావ‌డం లేదంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఆర్థికశాఖ‌కు సంబంధించిన ఓ ముఖ్య అధికారి తీరు పూర్తిగా ఇబ్బంది పెట్టే రీతిలో ఉందంటున్నారు ప‌లువురు మంత్రులు.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.