మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను బ‌య‌పెడుతున్న టీడీపీ నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 18:55:36

మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను బ‌య‌పెడుతున్న టీడీపీ నేత

నెల్లూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య విభేదాలు రోజు రోజుకు ర‌చ్చబండ‌కు ఎక్కుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి జిల్లా పార్టీ సమ‌న్వ‌య క‌మిటీలో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జిల్లాలో ఉన్న‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం టీడీపీ నాయ‌కులు త‌రచు ఇలాంటి స‌మ‌న్వ‌య క‌మిటీ పేరుతో స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తోంది. 
 
అయితే దీన్ని పూర్తిగా ఇండోర్ లోనే నిర్వ‌హిస్తుంటారు. అయితే ఇటీవ‌లే జ‌రిగిన ఈ స‌మావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి, సోమిరెడ్డి, నారాయ‌ణ‌ల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ లు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్ నేత‌లు పాల్గొన‌గానే ప్ర‌జ‌లు త‌మ ఇబ్బందుల‌ను తెలియ జేశారు. ఇక‌ ఈ స‌మావేశంలో ప్ర‌తీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు పార్టీ నాయ‌కులు. 
 
ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌న్న అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి బాగా తీసుకు వెళ్లాల‌ని నేత‌ల‌కు మంత్రులు సూచించార‌ట‌. అంతేకాదు ప్ర‌త్యేక హోదా కోసం తామే బాగా పోరాడుతున్నామ‌ని ప్ర‌తీ ఒక్క‌రు ప్ర‌జ‌ల‌కు తెలియ జేయాలన్నార‌ట‌. 
 
ఇక ఇదే సంద‌ర్భంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు లోక్ స‌భ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని రంగంలోకి దింపాల‌ని టీడీపీ నాయ‌కులు ఒక ప్ర‌తిపాద‌న‌కు వ‌చ్చార‌ట‌. అయితే ఈ విష‌యంపై ఆదాల స్పందింస్తు మోడీ హామీ స‌రే మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఇచ్చిన హామీల సంగ‌తేంట‌ని ప్ర‌శ్నించార‌ట‌. 
 
ఎన్ని హామీల‌ను ఇచ్చారు ఎన్నింటిని నెర‌వేర్చారనే లెక్క‌లు తీయాలన్నార‌ట‌. అంతేకాదు మంత్రులు ఇచ్చిన హామీలు కూడా నెర‌వేరలేద‌న్నార‌ట. ఇక ఈ విష‌యంపై ప్ర‌జ‌లు త‌మ‌ను ప్ర‌శ్నిస్తుంటే ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కావ‌డం లేద‌ని ఆదాల చెప్ప‌డంతో మంత్రులు కంగుతిన్నార‌ట‌. ప్ర‌ధానంగా నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పెండింగ్ లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న మంత్రుల దృష్టికి తీసుకువ‌చ్చార‌ట‌. 
 
వివిధ కార్య‌క్రమాల్లో పాల్గొనేందుకు ప్ర‌జ‌లు నిల‌దీస్తుంటే స‌మాధానం చెప్ప‌లేక పోతున్నామ‌ని అన్నార‌ట‌. చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎందుకు అమ‌లు కావ‌డం లేద‌ని అడిగితే ఏం స‌మాధానం చెప్పాలో మీరే స‌మాధానం చెప్పండని మంత్రుల‌ను ఆదాల ప్ర‌శ్నించార‌ట‌. జిల్లాలోని దాదాపు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో అనుచ‌ర బ‌లం ఉన్న ఆదాల లాంటి నేత ఈ విధంగా ప్రతిస్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.
 
అంతేకాదు ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ విష‌యంలో కూడా త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడ‌ద‌నే అల్టిమేట్ ను ఆదాల జారీ చేశార‌ట‌. మొత్తం మీద ఆదాల చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో క‌ల‌వ‌రం పుట్టిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.