చంద్ర‌బాబును ముప్పు తిప్ప‌లు పెడుతున్న ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 12:13:36

చంద్ర‌బాబును ముప్పు తిప్ప‌లు పెడుతున్న ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రెండు జిల్లాల అధికార తెలుగుదేశం పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడుని ముప్పుతిప్ప‌లు పెడుతున్నారా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎన్టీఆర్ హ‌యాం నాటి నుంచి నేటి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు టీడీపీకి కంచుకోట అనంత‌పురం జిల్లా అలాగే క‌ర్నూల్ జిల్లా, ఈ రెండు జిల్లాల టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ పరిస్థితి ముఖ్య‌మంత్రికి గంద‌ర‌గోళంగా మారుతోందట‌.
 
టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయినా కూడా ఈ రెండు జిల్లాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సుముఖంగా లేరని వార్తలు వ‌స్తున్నాయి. వారి స్థానంలో కొత్త‌వారికి సీటు ఇచ్చేందుకు సీఎం సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
అనంత‌పురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2014లో టీడీపీ సుమారు 12 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. ఆ త‌ర్వాత కొన్నిరోజులకు వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో క‌లిపితే మొత్తం ఈ జిల్లాలో13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌లో సుమారు ఎనిమిది మందికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున చంద్ర‌బాబు సీటు ఇచ్చేందుకు వెన‌క‌డుగు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఒకవేళ‌ ఇచ్చినా వారు గెల‌వ‌డం క‌ష్టంగా మారుతోంద‌నే ఉద్దేశ్యంతో వారి స్థానంలో కొత్త‌వారికి సీటు ఇచ్చేందుకు చంద్ర‌బాబు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇక క‌ర్నూల్ జిల్లా విష‌యానికి వ‌స్తే ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం మూడు స్థానాల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది. ఈ త‌ర్వాత అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి సుమారు ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యేలు  టీడీపీ తీర్థం తీసుకున్నారు. మొత్తం మీద టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు. ఇక వీరి ప‌రిస్థితి కూడా గంద‌ర‌గోళంగా మారింది. ఈ జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాలు 14 ఉంటే టీడీపీ ఇంచార్జ్ లు మాత్రం ప్ర‌తీ నియోజ‌క‌ర్గానికి ఇద్ద‌రు ఉన్నారు. వీరిద్ద‌రిలో సీటు ఎవ‌రికి ఇవ్వాల‌నే దానిపై చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. 
 
అనంత‌పురం జిల్లాలో ఉప‌యోగించిన స్ట్రాట‌జీని తిరిగి క‌ర్నూల్ జిల్లాలో ఉప‌యోగించి టీడీపీ త‌ర‌పున కొత్త‌వారిని బ‌రిలోకి దింపేందుకు చంద్ర‌బాబు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ఈ విష‌యం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ‌కు కాకుండా ఇంకెవ‌రికి సీటు కేటాయిస్తారో తాము కుడా చూస్తామ‌ని సిద్దంగా ఉన్నార‌ట‌. అవ‌స‌ర‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెబ‌ల్ గా అయినా దిగి టీడీపీ అభ్య‌ర్థిని ఓడించేందుకు సిద్ద‌మంటున్నారు. దీంతో చంద్ర‌బాబు నాయుడు ఏం చేయాలో తెలియ‌క‌ స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.