టీడీపీ ఎమ్మెల్యేల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న టీడీపీ నేత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-27 10:20:30

టీడీపీ ఎమ్మెల్యేల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్న టీడీపీ నేత‌

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో నెల్లూరు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో క‌ల‌వ‌రం పుట్టిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఆదాల ప్ర‌భాక‌ర్ నెల్లూరు పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓట‌మి పాలు అయ్యారు. ఇక అప్ప‌టి నుంచి జిల్లా పార్ల‌మెంట్ టీడీపీ ఇంచార్జ్ గా కొన‌సాగుతున్నారు ఆయ‌న‌. అలాగే నెల్లూరు రూర‌ల్ ఇంచార్జ్ గా కూడా ఉన్నారు. ఇక ఈ మ‌ధ్య‌కాలంలో టీడీపీ పై తీవ్ర సంతృప్తితో ఉన్న ఆనం రామ‌నారాయ‌న రెడ్డి ఇటీవ‌లే ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. 
 
దీంతో ఆత్మ‌కూరు ఇంచార్జ్ గా కూడా ఆదాల బాధ్య‌త‌ల‌ను చేప‌డుతున్నారు.  ఇక వీటితోపాటు కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం వైపు కూడా ఆదాల ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఒక చోట పోటీ చేసే ఆలోచ‌న‌లో ఆదాల ఉన్నార‌ని తెలుగు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతున్నారు. అయితే ఆయ‌న వ‌చ్చేఎన్నిక‌ల్లో ఎక్క‌డనుంచి భ‌రిలోకి దిగుతారో కాస్త క్లారిటీ ఇస్తే మిగిలిన చోట్ల ఎవ‌రు పోటీ చేస్తార‌న్నదానిపై క్లారిటి వ‌స్తుంద‌ట‌. ఇక ఇదే క్ర‌మంలో ఆత్మ‌కూరు నుంచి పోటీ చెయ్యాల‌ని క‌న్నబాబు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. 
 
అటు కొవ్వూరులో 2014లో జ‌రిగిన‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిచింది.  ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డికి కూడా ఆదాల నిర్ణ‌యం ఏంటో అర్థం కావ‌డంలేదట‌. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో నెల్లూరు ఎంపీగా, ఆత్మ‌కూరు, కొవ్వూరు,  నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యేలుగా ఎవ‌రు పోటీ చెయ్యాల‌నే విష‌యం తెలియాలంటే ఆదాల ఎక్క‌డ‌నుంచి పోటీ చేస్తాడో తేల్చాల్సిన ప‌రిస్ధితి వ‌చ్చింద‌ని అంటున్నారు. అయితే ఆదాల మాత్రం త‌న మ‌న‌సులో ఏముందో ఇంకా క్లారిటీ ఇవ్వ‌కున్నార‌ట‌. 
 
ఇక మ‌రో వైపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదాల‌ను మ‌రోసారి ఎంపీగా భ‌రిలోకి దింపాల‌ని చూస్తున్నారు. అయితే అందుకు పూర్తిగా సుముఖ‌త‌ను వ్య‌క్తం చెయ్య‌ని ఆదాల. త‌ప్ప‌ని స‌రిగా నెల్లూరు ఎంపీగా చెయ్యాలంటే పార్ల‌మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాల‌నే ష‌ర‌తుల‌ను పెట్టార‌ట‌. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇద్ద‌రు, ముగ్గురుని పేర్ల‌ను ప్ర‌తిపాధించిన ఆదాల అందులో ఎవ‌రినో ఒక‌రిని పార్టీ అధిష్టానం ఎంచుకునే ఛాయిస్ ఇచ్చార‌ట‌. 
 
ఒక వేల నెల్లూరు ఎంపీగా ఆదాల స‌సేమిరా అంటే కావ‌లి టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న మ‌స్తాన్ రావును పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా భ‌రిలోకి దించ‌వ‌చ్చ‌ని తెలుగుత‌మ్ముళ్లు గుస‌గులాడుతున్నార‌ట‌. మొత్తంమీద ఆదాల తాను ఎక్క‌డ పోటీ చేస్తాన‌న్న‌దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో అటు మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల‌ను ఆసిస్తొన్న ఆశావాహుల‌తోపాటు క్యాడ‌ర్ లోను గంద‌ర‌గోళం క‌నిపిస్తోంద‌ట‌. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం పార్టీ అధిష్టానాని కూడా త‌ల‌నొప్పిగా మారుతోంద‌ట‌.

షేర్ :

Comments

<