జ‌న‌సేన‌లోకి ఫిరాయించే టీడీపీ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

janasena and tdp
Updated:  2018-08-27 17:36:34

జ‌న‌సేన‌లోకి ఫిరాయించే టీడీపీ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బ‌యాందోళ‌న‌చెందుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ మీద పెంచుకున్న అసంతృప్తితో చాలామంది ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక పార్టీ ఫిరాయించిన వారి స్థానాల‌ను ఎలా ఫిల్ చెయ్యాలా అని టీడీపీ అధిష్టానం భావిస్తున్న స‌మయంలో జ‌న‌సేన పార్టీ నేత పార్థ‌సార‌ధి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
మ‌రి కొద్ది రోజుల్లో పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో సుమారు 22 మంది ఎమ్మెల్యేలు జ‌న‌సేన తీర్థం తీసుకోన్నార‌ని ఆయ‌న అన్నారు. అధినేత వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే చాలు ఉన్నప‌ళంగా పార్టీని వ‌దిలి వారంద‌రూ జ‌న‌సేన‌లోకి రావాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. 2009లో హోరా హోరీగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చిత్ర‌పరిశ్ర‌మ‌కు చెందిన హీరో మెగా స్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి అప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయ‌కులంద‌రిని త‌న పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టీడీపీ స్థాయికి మించిన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అంతేకాదు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట‌రావు కూడా ఉన్నప‌ళంగా పార్టీకి గుడ్ బై చెప్పి ప్ర‌జా రాజ్యంపార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఇప్పుడు కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు వ‌చ్చేఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కళ్యాణ్ పెద్ద‌స‌మ‌స్య తెచ్చిపెట్టారు. ప్ర‌స్తుతం టీడీపీకి చెందిన కొంద‌రు నాయ‌కులు జ‌న‌సేన వైపు మొగ్గు చూప‌డంతో  అధిష్టాన‌నాకి పెద్ద త‌ల‌నొప్పిగా మార‌నుంది. ముఖ్యంగా జ‌న‌సేన‌లోకి ఫిరాయించే టీడీపీ ఎమ్మెల్యేల‌లో మొద‌టగా మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేరు వినిపిస్తుంది. ఆయ‌న‌తో పాటు ఇదే జిల్లాకు చెందిన పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు అలాగే ప‌ల్లా శ్రీనివాస్ ల పేర్లు వినిపిస్తున్నాయి.. ఇక వారితో పాటు పాక‌రావుపేట ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత కూడా ఫిరాయించిన పెద్ద‌గా ఆశ్య‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.
 
ఇక తూర్పుగోదావ‌రిజిల్లా విష‌యానికి వ‌స్తే తోట త్రిమూర్తులు దాదాపు జ‌న‌సేన‌లో చేర‌డం కాయం అనే చెప్పాలి.ఇక ఆయ‌న‌తో పాటు టీడీపీ ఫిరాయింపు జ‌గ్గంపేట ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ అలాగే వ‌రుపుల సుబ్బారావు పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున అభ్య‌ర్థిగా సీటు ఖ‌రారు అయినా కూడా త‌న‌కు పార్టీ ప‌రంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌డంలేద‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న జ‌న‌సేన పార్టీలోకి మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ వ‌చ్చే నెల‌లో పార్టీ కండువా క‌ప్పుకోవ‌డం దాదాపు ఖాయం అని తెలుస్తోంది. 
 
ఇక ప‌శ్చిమ విష‌యానికి వ‌స్తే మంత్రి గంటా వియ్యంకుడు పుల‌ప‌ర్తి నారాయ‌ణ మూర్తి పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఇక కృష్టా జిల్లాలో ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావు కూడా చాలా కాలంగా ప‌క్క చూపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. గతంలో మండ‌లి బుద్ద‌ప్ర‌సాద్ కూడా జ‌న‌సేన తీర్థం తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ పార్టీ ఫిరాయించ‌డం విష‌యంలో నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. 
 
ఇక వీరికి తోడు మ‌రికొద్ది రోజుల్లో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు జ‌న‌సేన తీర్థం తీసుకోనున్నారు. మొత్తం మీద వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు సుమారు 20మంది ఎమ్మెల్యేలు జ‌న‌సేన వైపు మొగ్గు చూప‌డం ఖాయం అని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీటు క‌న్ఫామ్ కాద‌నే విష‌యం తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే టీడీపీకి గుడ్ బై చెప్పాల‌ని భావిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు నాయుడు కాస్త ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప‌వ‌న్ ఎఫెక్ట్ అధిష్టానానికి పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.