ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌తోనే ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 18:51:03

ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌తోనే ఫిక్స్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో రాజ‌కీయనాయ‌కులు రోజుకొక రంగుపూసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నారు.అయితే ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్టానంపై చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు.ఇక మ‌రికొంద‌రు అయితే టీడీపీ ప‌రిపాల‌న‌పై నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేస్తున్నార‌ని దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతుంద‌నే నేప‌థ్యంలో టీడీపీ చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉత్త‌రాంధ్రాకు చెందిన ఒక ఎంపీ స‌హా మూకుమ్మ‌డిగా సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడి య్యార‌ట‌.
 
ఇక ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు గుర్రున‌ ఉంటే వాటిని స‌రిదిద్దుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తుంటే మ‌రో ప్ర‌క్క ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యారు. ఈ గంద‌రగోళం నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నార‌ట‌. దీంతో వీరు మూకుమ్మ‌డిగా టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడి అయ్యార‌ట‌. 
 
ఇక‌ ఎమ్మెల్యేలు మాత్రం 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అవుతార‌నే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని అమ‌రావ‌తిలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రాయ‌ల‌సీమ‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని మిగిలిన ఒక్క‌ ఎమ్మెల్యే కోస్తాంధ్రాకు చెందిన వారుగా వార్త‌లు వస్తున్నాయి.
 
రాయ‌ల‌సీమ‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కొర‌త‌ ఉన్ననేప‌థ్యంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని చంద్ర‌బాబుకు తెలియ‌డంతో ఏం చేయాలో దిక్కుతోచట్లేద‌ట‌.. ఇక మిగిలిన ఆ ఒక్క‌ ఎమ్మెల్యే ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. తాను అధికార పార్టీలో ఉండి కూడా త‌న‌ నియోజ‌కవ‌ర్గంలో ఎలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఓట‌మి పాలు కావ‌డం ఖాయం తెలిసి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌నే వార్తలు వ‌స్తున్నాయి.
 
ఇక ఎంపీ మాత్రం ఏ పార్టీ లో చేరుతార‌నే దాని పై ఇంకా క్లారిటీ లేద‌ట‌. అయితే విస్వ‌స‌నీయ వ‌ర్గాల ప్ర‌కారం ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ త‌ర‌పున పోటీ చేసి మంత్రి ప‌ద‌విని ఆసిస్తున్నార‌ని అంటున్నారు. ఇక ఆయ‌న ఆలోచ‌న ప్ర‌కారం చేస్తే కొద్ది రోజ‌ల క్రితం క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఏవిధంగా జ‌రిగాయో అదే రీతిలో ఏపీలో జ‌రుగుతాయ‌నే నేప‌థ్యంలో ఆయ‌న ఈ నిర్ణయం తీసుకున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే ఆ టీడీపీ ఎంపీ తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి..ఎట్టి ప‌రిస్థితి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల లా జ‌రుగ‌వ‌ని ఇప్ప‌టికైనా మించిపోయింది ఏం లేద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల‌లోపు వేరే విధంగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచిస్తున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.