టీడీపీకి గుడ్ బై చెప్తున్న 5 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 3 సీనియర్ నాయకులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-14 15:54:40

టీడీపీకి గుడ్ బై చెప్తున్న 5 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 3 సీనియర్ నాయకులు

చాలాకాలంగా తెలుగుదేశం పార్టీకి అండ దండ‌లుగా ఉన్నటువంటి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ గుడ్ బై చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. అందులో 5 గురు ఎమ్మెల్యేలు, 4 గురు ఎంపీలు, ముగ్గురు ఇంచార్జ్ లు ఉన్నారు. అంతేకాదు వీరంద‌రూ వారి అనుచ‌రుల‌తో కార్య‌క‌ర్త‌ల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వీరంద‌రూ ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ రాజ‌కీయ వార‌స‌త్వంగా వార‌సుల‌ను రంగంలోకి దింపేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నుంచి ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాలు కాకుండా పరోక్షంగా రాజ‌కీయ వార‌సుల‌ను వెన‌కుండి న‌డిపించడానికి సిద్ద‌మ‌య్యారు. 
 
అందులో మొద‌టిగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో తాను పోటీ చెయ్య‌న‌ని త‌న బ‌దులు త‌న కుమారుడు ప‌వ‌న్  రెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తార‌ని చెప్పారు. ఇక ఇదే క్ర‌మంలో క‌ర్నూల్ జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ కూడా వ‌చ్చేఎన్నిక‌ల్లో త‌న కుమారుడు టీజీ భ‌ర‌త్ ను క‌ర్నూల్ అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భ‌రిలోకి దింపాల‌ని చూస్తున్నారు.
 
ఇక ఫిరాయింపు ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా వ‌చ్చేఎన్నిక‌ల్లో త‌న బ‌దులు త‌న వార‌సుల‌ను రంగంలోకి దింపేందుకు చూస్తున్నారు. ఆయ‌న‌కు వ‌య‌స్సు వృద్దాప్యంలోకి చేరుకోవ‌డంతో క‌చ్చింత‌గా పోటీ చేయ్య‌రు.దీంతో రాజ‌కీయ రిటైర్డ్ మెంట్ తీసుకుని ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లో త‌న వారుస‌లు దింపేందుకు స‌ర్వం సిద్దం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మ‌రో ఎంపీ ముర‌ళిమోహ‌న్... ఈయ‌న కూడా వ‌చ్చేఎన్నికల్లో త‌న కోడ‌లికి ఎమ్మెల్యే సీటు ఇప్పించాల‌ని చూస్తున్నారు. ఒక వేల ముఖ్య‌మంత్రి సీటు ఇవ్వ‌ని ప‌క్షంలో త‌న ఎంపీ సీటును కూడా త్యాగం చేసేందుకు సిద్ద‌మ‌య్యారు ముర‌ళి మోహ‌న్.
 
ఇక ఎంపీల రాజ‌కీయ రిటైర్డ్ మెంట్ తో పాటూ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు కూడా రిటైర్డ్ మెంట్ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2019లో హోరా హోరీగా సాగే ఎన్నిక‌ల్లో సుమారు న‌లుగురు ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాకు దూరంగా ఉంటార‌ని తెలుస్తోంది. వారి స్థానంలో వార‌సుల‌ను రంగంలోకి దింపేందుకు సిద్ద‌మ‌య్యారు. అందులో ముఖ్యంగా మంత్రి ప‌రిటాల సునిత ఆమె త‌న కొడుకు ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి దింపి రాజ‌కీయ రిటైర్డ్ మెంట్ త్వ‌ర‌లో తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి ఆయ‌న కూడా వ‌చ్చేఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాలుకు దూరంగా ఉంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ప‌త్తికొండ సెగ్మెంట్ నుంచి త‌న కుమారుడు శ్యాంబాబును టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేయించ‌నున్నారు. 
 
ఇక స్పీక‌ర్ శివ‌ప్ర‌సాద్ రావు కాడు త‌న సెగ్మెంట్ నుంచి త‌న వార‌సులును రంగంలోకి దించ‌నున్నారు. ఇదే క్ర‌మంలో మంత్రి గంట కూడా త‌నతో పాటు త‌న కుమారుడుకి కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎమ్మెల్యే సీటు ఇవ్వాల‌ని ఫోర్స్ చేస్తున్నారు. ఇక చివ‌రిగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఈయ‌న మొన్న‌టి వ‌ర‌కు తాడిప‌త్రిసెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారిని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో మీడియా స‌మావేశం ఏర్పుటు చేసి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను వ‌చ్చేఎన్నిక‌ల్లో పోటీ చెయ్య‌న‌ని త‌న బ‌దులు త‌న కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఇక ఇదే క్ర‌మంలో టీడీపీ ఇంచార్జ్ లు కూడా రిటైర్డ్ మెంట్ తీసుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొజ్జుల  కూడా ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూరంగా ఉండి త‌న కుమారుడిని రంగంలోకి దింపాల‌ని చూస్