రాజీనామా చేస్తాం..టీడీపీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 17:13:13

రాజీనామా చేస్తాం..టీడీపీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్తాప‌కులు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌కరామారావు నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కూ టీడీపీకి కంచుకోట‌గా వ‌స్తున్న జిల్లా అనంత‌పురం జిల్లా. అయితే ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కుల‌ ప‌రిపాల‌న నేపథ్యంలో జిల్లాలో రానున్న ఎన్నిక‌ల్లో  బీట‌లు వాలే ఛాన్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తాజా స‌ర్వేలు తెలుపుతున్నాయి. 
 
ఇక దీనికి తోడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో అనంత టీడీపీ నాయ‌కుల్లో వ‌ర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. అదిష్టానం సీట్లు నిర్ణ‌యించ‌క ముందే తాను లేక త‌మ అనుచ‌రుడు పోటీ చేస్తాడంటూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో విభేదాల‌కు మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు అయింది. ఇక ఈ వ‌రుస‌లో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు.
 
తాడిప‌త్రిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప‌ట్టు సాదించుకున్న జేసీ త‌న అనుచ‌రుల‌ను 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. అయితే ఆయ‌న ప్రయ‌త్నాల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులంతా ఒక్క‌ట‌యి జేసీ చెప్పిన‌ట్టు చేస్తే తాము త‌క్ష‌ణ‌మే టీడీపీకి రాజీనామా చేస్తామ‌ని గుంత‌క‌ల్ ఎమ్మెల్యే జితేంద్ర‌గౌడ్, అలాగే అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రిలు క‌లిసి అధిష్టానానికి హెచ్చ‌రించారు.
 
అనంత‌పురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న స్థానంలో గురునాథ్‌ రెడ్డిని పోటీ చేయించేందుకు జేసీ దివాక‌ర్ రెడ్డి వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. ఇక ఈ  విష‌యం తెలుసుకున్న ప్ర‌భాక‌ర్ చౌద‌రి తానుండ‌గా గురునాథ్‌ రెడ్డిని ఎలా పోటీ చేయిస్తార‌ని జేసీపై ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఆగ్ర‌హంతో ఉన్నారు. 
 
ఒక వేళ‌ అధిష్ఠానం జేసీ నిర్ణ‌యించిన అభ్య‌ర్తిని 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయిస్తే తాను క‌చ్చితంగా టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. అనంత‌పురం అర్భ‌న్ సీటుతో పాటు శింగనమల, రాయదుర్గం, కదిరి నియోజకవర్గాల్లోనూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జేసీ పావులు క‌దిపేందుకు తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.
 
దీంతో పాటు జేసీ త‌న నియోజ‌కవ‌ర్గం తాడిప‌త్రికి ద‌గ్గ‌ర‌లో ఉన్న‌గుంత‌కల్ నియోజ‌కవ‌ర్గాన్ని కూడా త‌న అధీనంలోకి తెచ్చుకునేందుకు జేసీ ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే గుంత‌క‌ల్ నియోజ‌కవ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర‌గౌడ్ ఉన్నారు. ఈయ‌న మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదే నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు.
 
కానీ జేసీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జితేంద్ర‌కు బ‌దులుగా త‌న అనుచ‌రుడు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తాను పోటీ చేయించేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, జేసీ పై తిరుగుబాటు చేస్తున్నారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేన‌ని తెలిసి కూడా జేసీ త‌న అనుచ‌రుడిని బ‌రిలోకి ఎలా దించుతార‌ని తిరుగు బాటు చేస్తున్నారు.
 
ఇక జేసీ అంత‌టితో ఆగ‌కుండా మంత్రి కాల్వ శ్రీనివాసులు నియోజ‌కవ‌ర్గం అయిన రాయదుర్గంలో కూడా త‌న ప‌ట్టు సాధించాల‌నే నేప‌థ్యంతో జేసీ త‌న అల్లుడు దీపక్ రెడ్డిని వ‌చ్చే ఎన్నికల్లో బ‌రిలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఆయ‌న మంత్రి బాధ్య‌త‌లు చేప‌డుతున్నారు కాబ‌ట్టి జేసీ ఆట‌లు ఇక్క‌డ సాగ‌లేద‌ని తెలుస్తోంది.
 
రాయ‌దుర్గంలో జేసి వ్యూహ‌లు ర‌చించ‌డంలో మంత్రితో వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది.ఇక ఆయ‌న పుట్ట‌ప‌ర్తి షిఫ్ట్ అయ్యారు.ఈ నియోజ‌కవ‌ర్గంలో ఎప్ప‌టి నుంచో పల్లెరఘునాథరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈ నియోజ‌కవ‌ర్గంలో జేసీకి అత్యంత న‌మ్మ‌కంగా ప‌ని చేస్తున్న పీఏను వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దించేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు.
 
ఈ నేప‌థ్యంలో గుంత‌క‌ల్ ఎమ్మెల్యే జితేంద్ర‌గౌడ్, అలాగే అనంత‌పురం అర్భ‌న్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రీలు ఒక అడుగు ముందుకు వేసి మంత్రి కాల్వ తో ఈ విష‌యం గురించి చ‌ర్చించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ అనుచ‌రుల‌ను బ‌రిలో దించితే తాము క‌చ్చితంగా టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారట‌. 
 
మంత్రి త‌న‌కున్న ప‌రిచ‌యంతో ఈ పంచాయితీని టీడీ జనార్దన్ దృష్టికి కాల్వ శ్రీనివాస్ తీసుకెళ్లారు. మధుసూదన గుప్తాను గురునాథ్ రెడ్డిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నార‌ని మంత్రి, జనార్దన్‌కు తెలిపారు.  
 
ఇక ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని టీడీ జనార్దన్ అనంత‌పురం ఎమ్మెల్యేలు జేసీ దివాక‌ర్ రెడ్డిపై త‌మ అభిప్రాయం ఏంటో త‌న‌కు పూర్తి నివేదిక ఇవ్వాల‌ని ఆ త‌ర్వాత ఏం చేయాలో పార్టీ నిర్ణ‌యిస్తుంద‌ని అన్నార‌ట‌. మొత్తానికి అనంత‌పురం జిల్లా వ్యాప్తంగా దాదాపు టీడీపీ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకమయ్యారు ఇక వ‌చ్చే ఎన్నికల్లో జేసీ దివాకర్‌ రెడ్డిని పార్లమెంట్‌ బరి నుంచి తప్పించాలన్న డిమాండ్‌ కూడా టీడీపీ ఎమ్మెల్యేల నుంచి బలంగా ఉంది. ఇక ఈ విష‌యంపై జేసీ ఎలా స్పందిస్తారో చూడాలి.

షేర్ :

Comments

1 Comment

  1. Vache vallu randi YSRCP ni baloetam cheddar,save AP state

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.