టీడీపీలో త్రిముఖ పోటీ ఖాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-09-18 12:04:02

టీడీపీలో త్రిముఖ పోటీ ఖాయం

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఏకైక ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావుపేట‌లో తొలిప్ర‌య‌త్నంలో ఎమ్మెల్యే అయ్యారు వంగ‌ల పుడి అనిత. ఎస్సీల త‌ర్వాత కాపు మ‌త్య్స‌కారులు, యాద‌వులు పాయ‌క‌రావు పేట‌లో అభ్యర్థుల గెలుపు ఓట‌మిల‌ను నిర్ధారిస్తారు. గ‌తంలో తెలుగుదేశం పార్టీ నుంచ గెలిచిన వెంగ‌ల వెంక‌ట‌రావు 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాబు రావు గెలిచారు. 
 
ఆ త‌ర్వాత  వైసీపీలో చేరిన బాబురావు నియోజ‌క‌వర్గంలో ఉపన్నిక‌లు జ‌రిగ‌తే ఆఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థిపై గెలిచారు. ఇక 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో గొల్ల‌బాబు రావును అధిష్టానం అమ‌లాపురం నుంచి పోటీ చేయించ‌డంతో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చంగ‌ల వెంక‌ట‌రావుకు అవ‌కాశం ద‌క్కింది. ఇక ఆ ఎన్నిక‌ల్లో చంగ‌ల‌పై అనిత గెలిచారు. 
 
తాండ‌వ‌, చ‌క్కర క‌ర్మగారాల ఆధునికీక‌ర‌ణ‌, పాయ‌క‌రావుపేట మెయిన్ రోడ్డువిస్త‌వ‌ణ, న‌క్క‌ప‌ల్లి ఆసుప‌త్రి వంటి వాటిని తాను ఎమ్మెల్యే అయితే నిర్మిస్తాన‌ని ఎన్నో హామీ ఇచ్చారు అనిత. కానీ అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యారు. పాయ‌క‌రావుపేట రోడ్డు విస్త‌ర‌ణ‌కు  వైఎస్ హయాంలోనే పాల‌ణప‌ర‌మైన నిధులు, విడుద‌ల అయినా ప‌నుల‌ను ప్రారంభించ‌క‌పోవ‌టం ఎమ్మెల్యే వాద‌నే అన్న వైఫ‌ల్యం ఉంది.
 
అక్క‌డ‌క్క‌డా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థకాల‌ను అమ‌లు చేశారు త‌ప్ప ఎమ్మెల్యే అనిత ప్ర‌త్యేకంగా చేసింది ఏమిలేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో టీటీడీ బోర్డు ప‌ద‌వి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి క్రిస్టియ‌న్ అనే వివాదంతో చేజారిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు పాయ‌క‌రావుపేట టికెట్ కు పోటీగా ఎవ్వ‌రు లేకున్నా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గంటెల సుమ‌న్ కూతురు టీడీపీలో చేరిక‌కు ఆస‌క్తి చూపుతున్నారు. ఆమె పార్టీలోకి వ‌స్తే పాయ‌క‌ర‌వుపేట టికెట్ కు ఇద్ద‌రు మ‌ధ్య పోటీ ఖాయంగా క‌నిపిస్తోంది. అంతేకాదు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంగ‌లి వెంక‌ట‌రావు ఆ త‌ర్వాత తిరిగి టీడీపీలో చేరారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ కోసం త్రిముఖ పోటీ ఖాయం అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.