గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు క‌న్నుమూత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 10:52:21

గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు క‌న్నుమూత

తెలుగుదేశం సీనియ‌ర్ నేత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు తుదిశ్వాస విడిచారు.. అర్ధ‌రాత్రి ఆయ‌న చికిత్స పొందుతూ హైద‌రాబాద్ లోని  క‌న్నుమూశారు... 71 సంవ‌త్స‌రాల ఆయ‌న‌కు భార్య, ఇద్ద‌రు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో అనేక కీల‌క ప‌ద‌వులు పొందారు...మూడు రోజుల క్రితం తీవ్రజ్వరంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారాయ‌న‌....అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల ఆయ‌న‌కు గుండె ఆపరేషన్ కూడా చేసిన‌ట్లు స‌న్నిహితులు చెబుతున్నారు.

 
సైన్స్ టీచ‌ర్ గా స‌ర్కారు కొలువు చేసిన ఆయ‌న, 1983 లో ఎన్టీఆర్ పార్టీ పెట్ట‌గానే ఆయ‌న పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు..సొంత జిల్లా చిత్తూరులో ఆయ‌న రాజ‌కీయంగా యాక్టీవ్ గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి పోటీ చేసి ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.. ఆయ‌న పై ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రోజా విజ‌యం సాధించారు వైసీపీ త‌ర‌పున‌..
 
1947 లో జ‌న్మించిన ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు... ఆయ‌న బీఎస్సీ ఎంఏ చ‌దివారు.. అలాగే న్యాయ‌విద్య‌ను కూడా అభ్య‌సించారు.. ఇక చిత్తూరు జిల్లాలో పుత్తూరును త‌న కంచుకోట‌గా మార్చుకున్నారు. ఆరుసార్లు అక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు... టీడీపీ హాయాంలో ఆయ‌న విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశారు...1987 లో అటవీశాఖ మంత్రిగానూ.. 1994లో ఉన్నత విద్యాశాఖా మంత్రిగానూ పనిచేశారు.
 
గ‌తంలో పార్టీ చీల‌క స‌మ‌యంలో ఆయ‌న ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీపార్వ‌తి వ‌ర్గంలో ఉన్నారు..ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో మళ్లీ టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయ‌న కుమారుడి రాజ‌కీయ అరంగేట్రం ఎమ్మెల్యేగా చూడాలని ఆయ‌న అనుకునే వారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడ్ని ఎమ్మెల్యేగా అరంగేట్రం చేయించాలి అని భావించారు..  ఆయ‌న అకాల మ‌ర‌ణం ప‌ట్ల తెలుగుదేశం నాయ‌కులు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.
 

షేర్ :

Comments

5 Comment

  1. college essay help college essays college essays [url=http://collegeessays.cars]college essays[/url]

    college essays college application essay personal essay for college [url=http://collegeessays.cars]college persuasive essay[/url]

    college essay writing college essays college essays college essay writing

    college essays college essay writing college essays [url=http://collegeessays.cars]college essays[/url]

    college essay scholarship essay writing about school college application essay [url=http://collegeessays.cars]compare and contrast essay help[/url]

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.