బ్రేకింగ్ వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 13:36:34

బ్రేకింగ్ వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్నాయంటే ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం, బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం ఖాయం. అయితే ఇలాంటి సంద‌ర్బాలే ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ తీర్ధం తీసుకుంటున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులంతా వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే బాట‌లో టీడీపీకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
తాజాగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ కీల‌క టీడీపీ నాయ‌కుడు త్వ‌ర‌లో వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మాగంటి ఫ్యామిలీ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రాజ‌కీయంగా మాగంటి ఫ్యామిలీ ఓ వెలుగు వెలిగింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో మాగంటి శ్రీనివాస్ కాంగ్రెస్ త‌రపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగితే అప్పుడు మాగంటి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. 
 
విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో మొద‌టి సారిగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో మాగంటి టీడీపీ త‌ర‌పున ఒంగోలు నుంచి ఎంపీగా పోటీచేసి త‌న ప్ర‌త్య‌ర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొన్నారు. ఇక ఆయ‌న కాంగ్రెస్ పార్టీ రుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించార‌ని సొంత నాయ‌కులు మాగంటికి స‌రైన గౌర‌వం ఇవ్వ‌డంలేద‌ని మ‌త‌ల‌బు చెందుతున్నార‌ట‌. అస‌లే ఈ జిల్లాలో ఎక్కువ‌గా టీడీపీ నాయకుల్లో వ‌ర్గ‌పోరు ఆధిప‌త్య‌పోరు అధికంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు ఆయ‌న‌పై అసంతృప్తి ఉంటే ఖ‌చ్చితంగా  పార్టీ త‌ర‌పున పోటీ చేస్తే గెల‌వ‌డం క‌ష్టంగా మారుతుంది.
 
గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలులో టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీచేసి ఓట‌మి చెందిన మాగంటి రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నాయ‌కుడు క‌నుక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌కు మొద‌ట్లో క్యాబినెట్ హోదాలో కీల‌క ప‌ద‌విని ఇస్తాన‌ని చెప్పారు. కానీ చంద్ర‌బాబు చివ‌రికి ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చి స‌రిపెట్టుకోమ‌ని చెప్పార‌ట‌.  ఇది ఎంత వ‌రకూ స‌మంజ‌సం అని ఆయ‌న జిల్లా నాయ‌కుల వ‌ద్ద అలాగే మంత్రుల వ‌ద్ద బాద‌ప‌డిన రోజులు ఉన్నాయ‌ని చెబుతున్నారు. 
 
పోయినంత‌కాలం టీడీపీలో స‌ర్ధుకుపోతే రానున్న‌రోజుల్లో రాజ‌కీయ మ‌నుగ‌డ ఉండ‌ద‌ని గ్ర‌హించి ఆయ‌న వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇదే విషయంపై మాగంటి శ్రీనివాస్ త‌న అనుచ‌రుల‌తో సీక్రెట్ గా స‌మావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల‌ను తెలుసుకున్నార‌ట‌. ఇక అనుచ‌రులు కూడా ఆయ‌న వైసీపీలో చేరేందుకు సుముఖంగా స‌మాధానం ఇవ్వ‌డంతో రానున్న కొద్ది రోజుల్లో ఆయ‌న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఒకవేళ‌ మాగంటి వైసీపీలో చేరితే  జ‌గ‌న్ ఆయ‌న‌కు ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటు వైవీ సుబ్బారెడ్డి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో అసెంబ్లీ నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయి. సో.. రాజ‌కీయంగా ప్ర‌కాశంలో పార్టీకి మ‌రింత  జోష్ రానుందని తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.