వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 17:33:24

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి అధికార ప‌గ్గాలు చేజిక్కించుకోవాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా మినీ మ‌హానాడు స‌భ‌లను ఏర్పాటు చేయాల‌ని గ‌తంలో ఆదేశించారు.
 
అయితే పార్టీ అధినేత పిలుపు మేర‌కు కొంత మంది టీడీపీ నాయ‌కులు మినీ మహానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన వారు త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీటు కేటాయిస్తారో లేదో అన్న అనుమానంతో ఉన్నారు. దీంతో స‌భ‌ల‌కు హాజ‌రు కావాల లేక డుమ్మా కొట్టాల అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. 
 
అయితే స‌భ‌ను ఏర్పాటు చేసిన కొన్ని చోట్ల టీడీపీ నాయ‌కులు తామంటే తాము గ్రేట్ అంటు ఇత‌ర నాయ‌కుల ముందే వారిని కించ పరిచేలా మాట్లాడుతూ స‌భ‌ను మ‌ధ్య‌లోనే నిలిపివేస్తున్నారు. ఇలా ఏదో ఒక కార‌ణంతో టీడీపీ నాయ‌కుల మ‌ధ్య రోజు రోజుకు గొడ‌వ‌లు పెరుగుతూనే ఉన్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో కొంత మంది టీడీపీ నాయ‌కులు చాలా రోజులుగా పార్టీ కి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. 
 
ఇక మ‌రి కొంద‌రు టీడీపీ నాయ‌కులు అయితే ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిప ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో పాల్గొని జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకుంటున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
వాస్త‌వానికి మాగుంట  చాలాకాలంగా  టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల మినీ మహానాడులో టీడీపీ అధిష్టానం తీరు మీద అసహనం ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తద్వారా తాను టీడీపీకి దూరమవుతున్నాననే సంకేతం ఎమ్మెల్సీ నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.