వైసీపీలోకి టీడీపీ ఎంపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 12:46:16

వైసీపీలోకి టీడీపీ ఎంపీ

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు  2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి టీడీపీ జెండాను ఎగ‌ర వేయాల‌నే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కుల‌తో మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే టీడీపీ నాయ‌కులు ఈ స‌భ‌ల‌ను వేదిక‌గా చేసుకుని ఒక‌రిపై ఒరు విమ‌ర్శ‌లు  చేసుకున్నారు.దీంతో  ఎటు చూసినా కూడా వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి.ఇక ఈ విభేదాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ కంటే సొంత పార్టీ నాయ‌కుల మ‌ధ్యే విభేదాలు ఎక్కువ‌గా చోటు చేసుకున్నాయి. దీంతో టీడీపీ కేడ‌ర్ బలంగా ఉన్నప్రాంతాల్లో  దీని ప్రభావం ఎక్కువ‌గా ప‌డుతోందని విశ్లేష‌కులు చెబుతున్నారు.
 
ఇక ఈ వ్య‌తిరేక‌త ప్ర‌భావం వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుందోలేదో అన్న సంకేతాలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి త‌లెత్త‌డంతో ఆయ‌న‌ను షాక్ కు గురిచేస్తుంది. దీంతో ఎప్పుడు ఏ టీడీపీ నాయ‌కుడు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారో అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో పాటు ప‌చ్చ బ్యాన‌ర్లు కూడా అందోళ‌న చెందుతున్నాయి.
 
అయితే ఇప్పటికే టీడీపీలో ఉన్న సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కులంద‌రూ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా టీడీపీలోని ప్ర‌స్తుత ఎమ్మెల్యేల‌తో పాటు, ఎంపీలు కుడా వైసీపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక  ఈ క్ర‌మంలో ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ఉన్నార‌ట‌. ఆయ‌న‌కు ఛాన్స్ దొరికితే చాలు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దంగా ఉన్నార‌ని సాక్షాత్తు నిత్యం టీడీపీ భ‌జ‌న చేసే ఎల్లో మీడియానే ఓ క‌థనంలోనే పేర్కొంది. 
 
అయితే ప్ర‌స్తుతం అన‌కాప‌ల్లి నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ జ‌గ‌న్ స‌మ‌క్షంతో వైసీపీలో చేరి 2019 ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా ఏంటో నిరూపిస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ట‌. అంతే కాదు త‌న‌కు భీమిలి త‌ర‌పున టికెట్ ఇస్తే గంటా శ్రీనివాసరావుపై పోటీ చేసి క‌చ్చితంగా గెలుస్తాన‌ని చెప్పినట్లు స్వ‌యానా ప్ర‌ముఖ ఎల్లో మీడియా ఓ క‌థ‌నంలో పేర్కొంది.
 
ఒక ఎంపీ అవంతి శ్రీనివాస్ మ‌రికొద్ది రోజుల్లో ప‌శ్చిమ గోదావ‌రిలో ప్ర‌జా సంక‌ల్ప‌య‌త్ర చేస్తున్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. ఎల్లో మీడియి క‌థ‌నం ప్ర‌కారం అవంతి కానీ వైసీపీ తీర్థం తీసుకుంటే మాత్రం చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్  త‌గులుతుంద‌నడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక రానున్న రోజుల్లో బాబు అండ్ కోలు ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాలి మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.