ఇది సినిమా కాదు ప‌వ‌న్ ద‌మ్ముంటే ఇక్క‌డికి రా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp cm ramesh and pawan kalyan
Updated:  2018-06-26 04:51:44

ఇది సినిమా కాదు ప‌వ‌న్ ద‌మ్ముంటే ఇక్క‌డికి రా..

అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కును డిమాండ్ చేస్తూ కేంద్రానిక వ్య‌తిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే  ఈ దీక్ష‌ పై తాజాగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌ట్టారు. సీఎం ర‌మేష్ చేస్తున్న దీక్ష ఒక దొంగ దీక్షని, ఈ దీక్ష‌లో ఏ మాత్రం చిత్తశుద్ది లేదంటూ ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌పై సీఎం ర‌మేష్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను చేస్తున్న దీక్ష‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ నీరు కార్చుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తాను కేంద్రం పై చిత్త శుద్దితోనే పోరాటం చేస్తున్నాని స్ప‌ష్టం చేశారు. అయితే ప‌వ‌న్ కు ఏమాత్రం అనుభ‌వం లేకుండా మాట్లాడి క‌డ‌ప పౌరుషాన్ని రెచ్చ‌గొడుతున్నార‌ని సీఎం ర‌మేష్ ఆయ‌న‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. రాజ‌కీయం అంటే సినిమాకాద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.
 
మొద‌టి నుంచి ఉక్కు పరిశ్ర‌మ కోసం కేంద్రంతో పోరాడుతున్న త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం మంచిది కాద‌ని సీఎం ర‌మేష్ స్ప‌ష్టం చేశారు. ఉక్కుప‌రిశ్ర‌మ‌ను తామెందుకు అడ్డుకుంటామ‌ని అవ‌గాహన‌ లేకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే ప‌వ‌న్  చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌న్నిటిపై చ‌ర్చ‌కు సిద్ద‌మేనా అని ర‌మేష్ స‌వాల్ విసిరారు. ఎక్క‌డో ఉండి మాట్లాడ‌టం కాద‌ని ద‌మ్ముంటే తాను దీక్ష‌చేస్తున్న స్థలానికివ‌చ్చి మాట్లాడాల‌ని సీఎం ర‌మేష్ తెలిపారు. తాము భావిత‌రాల‌కోసం ప్రాణాల‌కు తెగించి దీక్ష‌లు చేస్తుంటే త‌మ‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేయం మంచిదికాద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.