ఇది అస‌లైన సంచ‌ల‌నం సీఎం ర‌మేష్ దీక్ష విరామంతో బిగ్ రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp ramesh naidu
Updated:  2018-06-30 05:40:09

ఇది అస‌లైన సంచ‌ల‌నం సీఎం ర‌మేష్ దీక్ష విరామంతో బిగ్ రికార్డ్

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ‌ను డిమాండ్ చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ దీక్ష నేటికి 11వ రోజుకు చేరుకోవ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సీఎం ర‌మేష్ దీక్ష చేస్తున్నశిభిరానికి చేరుకుని ఆయ‌న‌కు నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప చేశారు. ఎంపీ ర‌మేష్ దీక్ష‌ను విర‌మించ‌డంతో రాష్ట్రంలో ఏ నాయ‌కుడు సృష్టించ‌ని స‌రికొత్త రికార్డ్ ను సృష్టించారు 
 
గతంలో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రాణాల‌కు తెగించి సుమారు వారం రోజులు పాటు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అందులో వృద్ధాప్యానికి చెందిన‌ ముగ్గురు ఎంపీలకు ఢిల్లీ వైద్యులు చికిత్స చేయ‌డంతో వారిని వెంట‌నే పోలీసుల‌ స‌హ‌కారంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇక మిగిలిన ఇద్ద‌రు యువ ఎంపీలు కూడా వారి కంటే రెండు రోజులు ఎక్కువగా దీక్ష చేయ‌లేకపోయారు. ఎవ‌రికైనా ఆక‌లి వేయ‌డం స‌హ‌జం దీంతో వారి ఆరోగ్యం క్షీణించ‌డంతో డాక్ట‌ర్లు వారిని కూడా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీనిని బట్టి చూస్తే ఓవ‌రాల్ గా ఈ దీక్ష వారం రోజుల‌పాటు వైసీపీ ఎంపీలు చేశారు.
 
ఇక ఇప్పుడు టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ 11 రోజులు ఆరోగ్యంగా నిరాహార దీక్ష‌ను ఎలా చేశాడ‌న్న‌ది వైసీపీ నాయ‌కులతో పాటు సాధార‌ణ ప్ర‌జ‌లకు కూడా పెద్ద‌ప్ర‌శ్నగా మారింది. పైగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కి 33 సంవ‌త్స‌రాలు వ‌య‌స్సు ఉంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి 40 సంవ‌త్స‌రాలు వ‌య‌స్సు ఉంది. మ‌రి వీరి కంటే ఎంపీ సీఎం ర‌మేష్ స‌గ‌టు 13 సంవ‌త్స‌రాలు పెద్ద‌వారు. ఇక వైసీపీ యువ ఎంపీలు చేయ‌లేని దీక్ష‌ను ఎటువంటి అనారోగ్యంతో బాద‌ప‌డ‌కుండా ర‌మేష్ నాయుడు ఎలా చేశార‌నేది  ప్ర‌శ్న‌గా మారింది. 
 
పైగా ఆయ‌న‌కు షుగ‌ర్, గ్యాస్ ట్ర‌బుల్ కూడా ఉంద‌ని వైసీపీ నాయ‌క‌లు చెప్పారు. ఇక ర‌మేష్ దీక్ష‌ను చూస్తుంటే గతంలో ప్రోద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివప్ర‌సాద్ రెడ్డి, రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిలు చేసిన విమ‌ర్శ‌లు వాస్త‌వం అని ప్ర‌జ‌లు భావిన్నారు. అందుకే రాజ‌కీయాల్లో టీడీపీ నాయ‌కులు మ‌రో స‌రికొత్త రికార్డ్ ను సృష్టించార‌ని చెప్పాలి. రికార్డ్ పేరును ప్ర‌జ‌లే నిర్ణ‌యించాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.