సీఎం ర‌మేష్ ప్ర‌ధాని మోడీకి సంచ‌ల‌న లేఖ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-18 18:23:29

సీఎం ర‌మేష్ ప్ర‌ధాని మోడీకి సంచ‌ల‌న లేఖ‌

క‌డప ఉక్కు రాయ‌ల‌సీమ హక్కు అనే నినాదంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్, క‌డ‌ప ఉక్కును డిమాండ్ చేస్తూ తాను ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తాన‌ని కొద్ది రోజుల క్రితం సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా మ‌రోసారి ఉక్కు ఫ్యాక్ట‌రీపై సీఎం ర‌మేష్ స్పందిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖ‌లో ఆయ‌న పేర్కొటూ కేంద్రం ఖ‌చ్చితంగా క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో సూచించారు. అలాగే స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మేకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యసాధ్యాల నివేదికను పరిశీలించాలని విన్నవించారు.
 
క‌డ‌ప‌లో స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి ఇప్ప‌డు ఏర్పాటు చేయ‌డం కుద‌రద‌ని చెప్ప‌డం ఏంట‌ని అన్నారు. కేంద్రం వెంట‌నే స్టీల్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయ్యాలి లేకపోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానని సీఎం ర‌మేష్ మ‌రోసారి కేంద్రానికి హెచ్చ‌రిచారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.