గ‌ల్లా జ‌య‌దేవ్ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 12:49:28

గ‌ల్లా జ‌య‌దేవ్ క్లారిటీ

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఒక వైపు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా పాద‌యాత్ర‌ను చేస్తున్నారు. ఇక మ‌రోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత సీఎం చ‌ద్ర‌బాబు నాయుడు కూడా మ‌రోసారి అధికాంలోకి రావాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరిద్ద‌రిలో ఎవ‌రు ప్ర‌జా ధ‌ర‌ణ పొందుతున్నారంటే ప్ర‌తిప‌క్ష‌నేత అని చెప్పాలి. ఎందుకంటే ఆయన  రాజ‌న్న పాల‌న తెస్తార‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ కు అధిక సంఖ్యలో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. 
 
ఇక ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి క‌చ్చితంగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహన్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయం అని అధికార టీడీపీ నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని  పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కులంద‌రూ వైసీపీ తీర్థం తీసుకున్నారు. 
 
ఇక ఇదే క్ర‌మంలో ప‌ద‌విలో ఉన్న‌టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఛాన్స్ దొరికితే చాలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా టీడీపీ గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా త్వ‌ర‌లో వైసీపీలో చేరుతారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వార్త‌లు వ‌చ్చాయి. 
 
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర వ‌స్తున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న ఆధ్వ‌ర్యంలో గుంటూరు జిల్లాలో స‌ర్వేను నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో కచ్చితంగా టీడీపీ ఓట‌మిపాలు కావ‌డం ఖాయం అని తేలింది. దీంతో చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గల్లాకు టీడీపీ త‌ర‌పున టికెట్ కేటాయించ‌డం క‌ష్టంగా మార‌డంతో ఆయ‌న వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌చ్చాయి.
 
ఇక తాజాగా త‌నపై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించారు గ‌ల్లా జ‌య‌దేవ్.... కొద్దిరోజులుగా త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని అన్నారు. తాను ఎట్టిప‌రిస్థితిలో టీడీపీ పార్టీ నుంచి వైసీపీ లోకి వెళ్ల‌న‌ని స్ప‌ష్టం చేశారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గుంటూరులో పోటీ చేస్తాన‌ని చెప్పారు. అలాగే  ఆయ‌న త‌ల్లి గ‌ల్లా అరుణ కుమారి కూడా పార్టీ మారుతున్నారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై కూడా స్పందించారు. ఆమె అమెరికా వెళ్లే ముందు రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని చెప్పారన్నారు. దీనికి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.