వైసీపీలోకి గ‌ల్లా జ‌య‌దేవ్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 18:43:35

వైసీపీలోకి గ‌ల్లా జ‌య‌దేవ్..?

మొన్న బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే జ‌నార్థ‌న రెడ్డి, నిన్న‌ అన‌కాప‌ల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట టీడీపీ అధిష్టానం నిర్ణ‌యంతో అసంతృప్తి చెందుతున్నారు. దీంతో  సైనిక‌ నాయ‌కులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక తాజాగా ఇదే వ‌రుస‌లో టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో గ‌ల్లా టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గుంటూరు జిల్లాకు పార్ల‌మెంట్ స‌భ్యుడిగా బాధ్య‌త‌లను చేప‌డుతున్నారు.
 
అయితే ఇప్పుడు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం గ‌ల్లా జ‌య‌దేవ్ రానున్న‌కొద్ది రోజుల్లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అయ్యార‌ని గుంటూరు జిల్లాలో ఈ వార్త కోడై కూస్తోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రాద‌నే నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌ని గుంటూరు నాట గుస‌గుస‌లు. 
 
ఇక దీంతో పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాలో టీడీపీ ప్ర‌భావం ప్ర‌జ‌ల్లో ఎలా ఉందో అని తెలుసుకునేందుకు ఓ ర‌హ‌స్య స‌ర్వేను నిర్వ‌హించారట‌. ఈ సర్వేలో టీడీపీ క‌చ్చితంగా ఓట‌మి పాలు కావ‌డం ఖాయం అని తేలడంతో టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తాజాగా విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
అంతే కాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం అని చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింద‌ట‌. అలాగే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న ఒక్క‌డే ప్ర‌త్యేక హోదా కావాలంటూ దీక్ష‌లు చేశార‌ని ఈ దీక్ష‌తో ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ కు సానుభూతి పెరిగి టీడీపీపై వ్య‌తిరేక‌త ప్ర‌భావం ఎక్కువ అయింద‌నే నేప‌థ్యంలో గ‌ల్లా ఈ నిర్ణయం తీసుకున్నార‌ట‌. 
 
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. దీంతోపాటు ఓటుకునోటు తెర‌పై తీసుకురావ‌డం, టీడీపీ నాయ‌కులు అధికారంతో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అలాగే రాష్ట్రాభివృద్దికి నిధులు వచ్చే సమస్యే లేదని బీజేపీ నాయ‌క‌లు తేల్చి చెబుతున్నారు. 
 
ఇక వారి వాద‌న‌లు విన్న గ‌ల్లా టీడీపీని వీడాల‌ని చూస్తున్నార‌ట‌. దీనికితోడు ఆయ‌న మామ సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల రోజున క‌చ్చితంగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్ప‌డం ఇవ‌న్ని చూస్తుంటే కచ్చితంగా గ‌ల్లా జ‌య‌దేవ్ పార్టీ మార‌డం త‌ధ్యం అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.
 
అయితే గ‌తంలో కూడా ఇలాంటి వార్త‌లు వ‌స్తే ఆయ‌న స్పందించారు. తాను ఎట్టి ప‌రిస్థితిలోను టీడీపీని వీడ‌న‌ని మీడియా ద్వారా చెప్పారు గ‌ల్లా. మ‌రి ఇప్పుడు ఈ విషయాలపై స్పందిస్తారా..? లేదా..? అని ప్రజలు అనుకుంటుంటే, టీడీపీ నాయ‌కులు మాత్రం ఆయ‌న‌ స్పందన ఎలా ఉంటుందోనని వణికి పోతున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తానికి రానున్న‌రోజుల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

1 Comment

  1. If this is the fact its Super for our YCP......

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.