గ‌ల్లా కోసం గాలింపు చ‌ర్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

galla jayadev
Updated:  2018-10-02 11:27:45

గ‌ల్లా కోసం గాలింపు చ‌ర్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి. ఈ ప్రాంతం రాజ‌కీయ చైత‌న్యానికి నిల‌యంగా చెప్పుకుంటారు రాష్ట్ర ప్ర‌జ‌లు. అలాంటి గుంటూరు జిల్లాలో గ‌త ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న మాజీ మంత్రి గ‌ల్లా అరుణ కుమారుడు అయిన జ‌య‌దేవ్ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఆ త‌ర్వాత చిత్తూరు జిల్లాకు వ‌ల‌స వ‌చ్చి గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేశారు. త‌న‌కు ఓట్లు వేసీ గెలిపిస్తే ప్ర‌తీ ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తాన‌ని, ఈ ప్రాంతంలో పెద్దఎత్తున ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకుస్తాన‌ని అప్ప‌ట్లో గ‌ల్లా జ‌య‌దేవ్ హామీలు ఇచ్చారు. అయితే జ‌య‌దేవ్ బ‌డా పారిశ్రామిక వేత్త కాబ‌ట్టి త‌న‌ప‌ర‌ప‌తిని ఉప‌యోగించి నిజంగానే ప‌రిశ్ర‌మ‌లను తీసుకువ‌స్తార‌ని, అలాగే యువ‌త‌కు ఉద్యోగ‌ అవ‌కాశాలు దొరుకుతాయ‌ని జిల్లా ప్ర‌జ‌లంద‌రూ ఊహించారు.
 
అయితే ఈ నాలుగున్న‌ర ఏళ్ల‌లో వేళ్ల‌మీద లేక్క‌పెట్ట‌నన్నిసార్లు మాత్ర‌మే గ‌ల్లా గుంటూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించార‌ట‌. రాజ‌ధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులు త‌మ బాధ‌ను చెప్ప‌కుందాము అంటే వినేనాధుడు క‌నిపించ‌కున్నార‌ని అక్క‌డి ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నార‌ట‌. అంతేక‌దు ఈ జిల్లాలో తాగు నీటి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న కూడా ప‌ట్టించుకునే వారులేర‌ని మండిప‌డుతున్నారు.
 
గ‌తంలో త‌మ బ్ర‌తుకులు బాగుప‌డుతాయ‌ని భావించి గ‌ల్లాను గెలిపిస్తే త‌మ‌ను నిట్ట‌నిలుముంచార‌ని ప్ర‌జ‌లు బాద‌ప‌డుతున్నార‌ట‌. ఇక ఇదే క్ర‌మంలో నిరుద్యోగులు కూడా త‌మ‌న ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌న్న విషయాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌శ్నించాల‌ని చూస్తున్నారు. అయితే గ‌ల్లా మాత్రం వారికి క‌న‌బ‌డ‌కుండా త‌ప్పించుకుంటూ తిరుగుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో చివ‌ర‌కు సొంత పార్టీ నేత‌లు ఫోన్ చేసినా కూడా రెస్పాన్ ఇవ్వ‌కున్నారంటే ప‌రిస్థితి ఎంత దారునంగా ఉందో అర్థం అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.