బాబును ఇర‌కాటంలో పెట్టిన గల్లా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-24 13:31:59

బాబును ఇర‌కాటంలో పెట్టిన గల్లా

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాలైన‌టువంటి ప్రత్యేక హోదా, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌, రైల్వే జోన్ ల‌ను డిమాండ్ చేస్తూ  పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశంలో కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే వారు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గ‌త వారంలో చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చ‌లో టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జ‌య‌దేవ్ కేంద్రంపై ఎందుకు అవిశ్వాసం పెట్టారో త‌న ప్ర‌సంఘం ద్వారా వివ‌రించారు. 
 
స‌భ‌లో ఆయ‌న ప్రసంగించ‌బోయే ముందు మాట ఇచ్చి తప్పేవాడు మనిషే కాదు అంటూ త‌న బామ్మ‌ర్ధి మ‌హేష్ సినిమా డైలాగ్ ను చెప్పి స‌భ‌లో మాట్లాడారు. ఇక ఆయ‌న స‌భ‌లో సినిమా డైలాగ్ వాడ‌టంతో ఆ పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని ఇర‌కాటంలో పెట్టారు.
 
గల్లా జ‌గ‌య‌దేవ్ స‌భ‌లో మాట్లాడిన మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల విష‌యంలో మాట త‌ప్పింది ప్ర‌ధాని మోడీ ఒక్క‌రే కాద‌ని ఇందులో ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా మాట త‌ప్పార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో మిత్ర‌ప‌క్షం వ్య‌హ‌రించిన చంద్ర‌బాబు ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి ప్ర‌త్యేక హోదా గుర్తుకు వ‌చ్చిందా.. అని వారు మండిప‌డుతున్నారు.
 
అంతేకాదు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు ఆరువంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక్క హామీను కూడా అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. లోక్ స‌భ‌లో టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మాట ఇచ్చి తప్పేవాడు మనిషే కాదు అనే డైలాగును మోడీతో పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పై కుడా అప్లై చేసి ఉంటే బాగుంటుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మొత్తానికి గల్లా  డైలాగ్ మోడీని ఇర‌కాటంలో పెట్టింది అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఈ డైలాగ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని పూర్తి స్థాయిలో ఇర‌కాటంలోకి నెట్టేసింద‌నే చెప్పాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.