లోక్ స‌భ‌లో టీడీపీ సినిమా క‌థ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-20 13:40:26

లోక్ స‌భ‌లో టీడీపీ సినిమా క‌థ‌లు

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే వారు ప్ర‌వేశపెట్టిన తీర్మానం ఈరోజు చ‌ర్చ జ‌రుగ‌నున్న‌ క్ర‌మంలో టీడీపీ ఎంపీ కేసినేని బదులుగా పార్టీ త‌రుపున గల్లా జ‌య‌దేవ్ ప్రారంభించారు.
 
ప్రారంభంలోనే భ‌రత్ అను నేను సినిమాను లో ఉన్న డైలాగ్ ను మేడ‌మ్ స్పీక‌ర్ అంటూ గ‌ల్లా ప్ర‌స్తావించారు. తాము భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి బ‌య‌ట‌కు రాగానే  బీజేపీ నాయ‌కులు యుద్దం చేస్తున్నార‌ని ఆయ‌న స్పీక‌ర్ కి వివ‌రించారు. అయితే ఆ యుద్దం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై కాద‌ని టీడీపీ పైనే అని తాము భావిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అయితే తాము ధ‌ర్మంగా ధ‌ర్మ‌పోరాటం చేస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టింది నాలుగు కార‌ణాల వల్ల అని తెలిపారు. అందులో న‌మ్మ‌కం, పార‌ద‌ర్శ‌క‌త‌, ప‌క్ష‌పాతం, ప్రాధాన్య‌త‌. అంతేకాదు ఏపీని విభ‌జించి తెలంగాణ‌ను ఏర్పాటు చేశామ‌ని  చెప్పారు. అయితే విభ‌జ‌న వల్ల కొత్త‌గా ఏర్ప‌డింది కేవ‌లం ఆంధ్ర‌ప‌ప్రదేశ్ మాత్ర‌మే అని స్పీక‌ర్ కు తెలిపారు. 
 
విభ‌జ‌న త‌ర్వాత  ఏపీకి రాజ‌ధాని లేదు మౌలిక స‌దుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అన్నారు. దీంతో స‌భ‌లో ఉన్న టీఆర్ ఎస్, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పై విరుచుకుప‌డ్డారు. దీంతో సభ కొద్దిసేపు గంద‌ర‌లోగోళంగా మారింది. దీంతో టీడీపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ గా మారింది.
 
అంతేకాదు కేంద్ర ప్ర‌భుత్వం వల్ల తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని గల్లా జ‌య‌దేవ్ స్ప‌ష్టం చేశారు. విభ‌జ‌న చ‌ట్టాన్ని అప్ర‌జాస్వామికంగా స‌భ‌లో నెగ్గించార‌ని అన్నారు. విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తీవ్ర‌మైన లోటు ఏర్ప‌డింద‌ని స్పీక‌ర్ కు వివ‌రించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.