టీడీపీ ఎంపీకి వైసీపీ టికెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-13 12:04:49

టీడీపీ ఎంపీకి వైసీపీ టికెట్

2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి ఇప్ప‌టి నుంచే టీడీపీ నాయ‌కులు వైసీపీలో చేరేందుకు లైన్ క‌డుతున్నారు. అయితే కొంత మందికేమో  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెల‌వాల‌ని కోరిక, ఇక మ‌రికొంద‌రికి వైసీపీ అధికారంలోకి వ‌స్తుంది..క‌నుక త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నే ఆశ‌తో టీడీపీ, ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేసేందుకు చూస్తున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులంతా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ప్ర‌స్తుత టీడీపీ ఎంపీలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టికే అన‌కాప‌ల్లి ఎంపీ  అవంతి శ్రీనివాప్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి పోటీ చేస్తాన‌ని బ‌హిరంగంగానే చెప్పారు. గ‌తంలో ఈ సెగ్మెంట్ నుంచి అవంతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపోందారు. అందుకే తిరిగి ఇక్క‌డి నుంచి పోటీచేయాల‌ని చూస్తున్నారు అవంతి.
 
అయితే ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గంటా శ్రీనివాపురావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు గంటా సీటుకు ఎస‌రు పెట్టారు అవంతి, దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా టీడీపీ చెందిన మ‌రో ఎంపీ కూడా అవంతి బాట‌లోనే ప‌ట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవ్వాల‌నే కోరిక‌తో కాకినాడ ఎంపీ  తోట న‌ర‌సింహా వ్యూహ‌లు ర‌చిస్తున్నార‌ట‌. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014 లో మొట్ట‌ముద‌టి సారిగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే చివ‌రి క్ష‌ణ‌ల్లో చంద్ర‌బాబు నాయుడి స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకుని కాకినాడ ఎంంపీగా పోటీ చేశారు తోట‌. 
 
అయితే ఆ ఎన్నిక‌ల్లో కేవ‌లం త‌న ప్ర‌త్య‌ర్థి పై మూడువేల పైచిలికి ఓట్ల‌తో ఎంపీగా గెలిచారు. ఇక ఎంపీ సీటు ఆయ‌న‌కు పెద్ద‌గా అచ్చు వ‌చ్చిన‌ట్లు క‌నిపించ‌లేదు దీంతో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే ముందుగా తోట జ‌గ్గంపేటలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని చూశారు. కానీ అక్క‌డ జ్యోతుల నెహ్రూ బ‌లంగా ఉన్నారు. ఈయ‌న 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మోజారిటీతో గెలిచి ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. సో ఈ నియోజ‌క వ‌ర్గం నుంచి ఖ‌చ్చితంగా జ్యోతుల వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు. ఇక ఈ నియోజ‌క వ‌ర్గంలో తోట న‌ర‌సింహ అశ‌లు పెట్టుకున్నా ఫ‌లితం మాత్రం ద‌క్క‌దని తెలుసుకున్నారు.
 
ఇక చివ‌రి అస్త్రం పిఠాపురం అయితే ప్ర‌స్తుతం ఈ నియోజ‌కవ‌ర్గంపై క‌న్నేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపులు బ‌లంగా ఉన్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి వ‌ర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి సుమారు 50 వేల మెజార్టీ ఓట్ల‌తో గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. కాపులు బ‌లంగా ఉన్నా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాగైనా వ‌ర్మ‌ను త‌ప్పించి టీడీపీ త‌ర‌పున పోటీచేయాల‌ని చూస్తున్నార‌ట తోట న‌ర‌సింహం.
 
గ‌తంలో కేబినెట్‌లో మంత్రిగా ప‌వ‌ర్ రుచి చూసిన ఆయ‌న‌కు ఎంపీ ప‌ద‌వి అంత కిక్ ఇవ్వ‌లేద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే వైసీపీలోకి జంప్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌న్న గ‌ట్టి నిర్ణ‌యంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు. చూద్దాం ఒక వేల తోట న‌ర‌సింహం వైసీపీలో చేరితే  జ‌గ‌న్ ఎక్క‌డినుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తార‌నే పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.