రాహూల్ గాంధీ పెళ్లిపై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 18:27:18

రాహూల్ గాంధీ పెళ్లిపై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అధికార తెలుగుదేశం పార్టీ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి గురించి పెద్ద‌గా పరిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కుల‌పై, అలాగే దేశ‌రాజ‌కీయ నాయ‌కుల‌పై ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి. అంతేకాదు 2014లో రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఏపీముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడుపై అనేక సంద‌ర్బాల్లో జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇక ఇదే క్ర‌మంలో మ‌రోసారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాహంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ. ఈరోజు అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు చాలాసార్లు మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాహూల్ వివాహ విష‌యంలో అనేక స‌ల‌హాలు ఇచ్చేవాడిన‌ని చెప్పారు. 
 
రాహుల్ కు ఉత్త‌రప్ర‌దేశ్ కు చెందిన ఓ బ్రాహ్మ‌ణ కుంటుంబానికి చెందిన అమ్మాయితో వివాహం చేస్తే ఉత్త‌రప్ర‌దేశ్ లో ఉన్న బ్రాహ్మణ ఓట్ల‌న్ని కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని చెబితే త‌న మాట‌ల‌ను సోనియా గాంధీ ప‌ట్టించుకోలేద‌ని జేసి దివాక‌ర్ రెడ్డి ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.