అప్పుడు నువ్వు గాడిద‌లు కాస్తున్నావా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 16:49:49

అప్పుడు నువ్వు గాడిద‌లు కాస్తున్నావా...

రాజ‌కీయాలకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ఏ విష‌యం అయినా ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి. ప‌ద‌విలో ఉన్నా ప‌ద‌విలో లేకున్నా ప్ర‌తిప‌క్షాల‌పై కాని టీడీపీ నాయ‌కుల‌పై కాని నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు జేసీ.అయితే ఇదే క్ర‌మంలో గతంలో కూడా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడ‌ని చూడ‌కుండా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోని మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్వామి వారి న‌గ‌లు పోయాయ‌ని అంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని అయితే వారు న‌గ‌లు పోయిన‌ప్పుడు ప్రధాన అర్చకులుగా ఉన్నారు క‌దా..! మ‌రి ఆ స‌మ‌యంలో ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని మండిప‌డ్డారు. ఆయ‌న‌ అర్చ‌కులుగా ఉన్న స‌మ‌యంలో న‌గ‌లు పోయాయ‌ని ఫిర్యాదు చేసి ఉంటే ప్ర‌జ‌లు న‌మ్మేవార‌ని జేసీ అన్నారు.
 
ఆ స‌మ‌యంలో స్వామి వారి న‌గ‌లు పోయిన వెంటనే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా..? నిద్ర పోయావా..?  లేక గాడిదలు కాస్తున్నావా..? దేవుడి సేవలో ఎన్నో ఏళ్ల పాటు ఉన్న నీవు అప్పుడు ఈ విషయం చెప్పలేదంటే... నీవు దొంగ స్వామి అయినా అయి ఉండాలి లేదా ఇందులో భాగస్వామివైనా అయి ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ దివాక‌ర్ రెడ్డి. ఇక ఈ విష‌యంపై ర‌మ‌ణ దీక్షితులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.