బాబు నాట‌కాలు ఆడుతున్నారు.. క‌డ‌ప‌కు తుక్కు కూడా రాదు జేసీ సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 17:54:18

బాబు నాట‌కాలు ఆడుతున్నారు.. క‌డ‌ప‌కు తుక్కు కూడా రాదు జేసీ సంచ‌ల‌నం

రాజ‌కీయాలకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ఈయ‌న ఏ విష‌యం అయినా ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి. గ‌తంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు జేసీ దివాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబు నాయుడుకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు.ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామ‌రూపం లేకుండా పోవ‌డంతో  జేసీ గ‌తంలో ఎవ‌రినైతే తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారో ఆయ‌న స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. 
 
టీడీపీ తీర్థం తీసుకున్నా కూడా చంద్ర‌బాబు నాయుడిపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఆప‌లేదు. తాజాగా మ‌రోసారి ముఖ్య‌మంత్రి పై విమ‌ర్శ‌లు చేసి టీడీపీ నాయ‌కుల‌ను షాక్ కు గురిచేశారు. క‌డప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సంఘీభావం తెలిపేందుకు ఈ రోజు  జేసీ క‌డ‌ప‌కు వెళ్లారు. 
 
ర‌మేష్ కు సంఘీభావం తెలిపిన త‌ర్వాత ఆయ‌న స‌భ‌లో మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏం త‌క్కువ అయినోడు కాద‌ని నాటకాలడటం, డ్రామాలు ఆడించడం, మాటలు చెప్పడం, కుయుక్తులు పన్నడం ఆయ‌న‌కు బాగా తెలుస‌ని అందుకే మోడీ రాష్ట్రానికి ఏం చేయ‌డంలేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప ఉక్కు కోసం ఎంపీ ర‌మేష్ కు పిచ్చిప‌ట్టి దీక్ష‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు ఈ దీక్ష‌లో ర‌మేష్ కు నిజాయితీ లేద‌ని విమ‌ర్శ‌లు చేశారు. 
 
రాష్ట్రంలో ఇలాంటి దీక్ష‌లు ఎన్ని చేసిన క‌డ‌ప‌కు ఉక్కు ప‌రిశ్ర‌మ కాదు క‌దా తుక్కు ప‌రిశ్ర‌మ కూడా రాద‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీక్ష చేస్తున్న వీరంద‌రూ ప్ర‌తీ రోజు మందుల‌తో పండించిన తిండిని తింటున్నార‌ని అందుకే వీరు చేసే దీక్ష‌ల్లో నీజాయితీ లేద‌ని అన్నారు. ఇక జేసీ చేసిన వ్యాఖ్య‌లు విన్న టీడీపీ నాయ‌కులంద‌రూ ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.