2019 లో టీడీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయే తేల్చి చెప్పిన జేసీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 16:58:19

2019 లో టీడీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయే తేల్చి చెప్పిన జేసీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న నేప‌థ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మ‌ధ్య వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ వ‌ర్గ విభేదాలు టీడీపీ కంచుకోట అనంత‌పురం జిల్లాలో ఎక్కువ అవుతున్నాయి.
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి పార్టీలో ఉన్న మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు చెమ‌ట‌లు పుట్టిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా త‌న అనుచ‌రుల‌ను రంగంలోకి దించి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఎస‌రు పెడుతున్నారు జేసి దివాక‌ర్ రెడ్డి.
 
ఇక ఆయ‌న ప్ర‌వ‌ర్త‌నను చూసిన ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు జేసీ దివాక‌ర్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే వారు చేసిన విమ‌ర్శ‌లను ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటు వెళ్తున్నారు జేసీ దివాక‌ర్ రెడ్డి. ప్రస్తుతం అనంత‌పురం జిల్లాలో 13 మంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారిలో ఒక‌రు ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారు.
 
తాజాగా ఈ 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జ్యోస్యాన్ని జేసీ చంద్ర‌బాబుకు వివ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత‌మంది గెలుస్తారు ఎంత‌మంది ఓడిపోతారు అన్న విష‌యాల‌న్ని జేసీ దివాక‌ర్ రెడ్డి  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సాక్షాల‌తో స‌హా వివ‌రిస్తున్నార‌ట. వ‌చ్చేఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను పోటీ చేయిస్తే టీడీపీ క‌చ్చితంగా ఓడిపోతుంద‌ని చంద్ర‌బాబుకు వివ‌రించారు. అయితే ఇదే విష‌యాన్ని జేసీ మీడియా స‌మావేశంలో కూడా వివ‌రించారు.
 
వ‌చ్చేఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తే అనంత‌పురం జిల్లాలో టీడీపీకి కేవ‌లం మూడు సీట్లు మాత్ర‌మే ద‌క్కుతాయ‌ని జేసీ జోస్యం చెప్పారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జేసీపై రగిలిపోతున్నారు. మొత్తానికి జేసీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో టీడీపీ నాయ‌కుల్లో క‌ల‌క‌లం రేపింద‌నే చెప్పాలి. 
 
ఇక మ‌రో వైపు జేసీ సీనియ‌ర్ రాజ‌కీయ నేత కాబ‌ట్టి అయ‌న‌కు జిల్లాలో ఏ రాజ‌కీయ నాయ‌కుడికి ఎంత ప‌ట్టు ఉంటుందో తెలుస్తుంది. అందుకే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. మొత్తం మీద 2019లో టీడీపీ కోట‌లో వైసీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయం అని ప‌రోక్షంగా జేసీదివాక‌ర్ రెడ్డి చెబుతున్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.