సోనియాకు స్పెష‌ల్ క్లాస్ తీసుకున్న జేసీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-20 18:39:18

సోనియాకు స్పెష‌ల్ క్లాస్ తీసుకున్న జేసీ

రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఆయ‌న ఏది మాట్లాడినా కూడా సంచ‌ల‌నంగా మారుతోంది. ఇటు పార్టీ ప‌రంగా ఎటు వంటి ఎత్తుగ‌డ‌లు వేసినా, అటు వ్య‌క్తిగతంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా కూడా అది బ్రేకింగ్ అవుతోంది. 
 
పార్ల‌మెంట్ స‌మావేశంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే అసెంబ్లీ స‌మావేశాల‌కు. నేను వెళ్ల‌నంటే.. వెళ్ల‌నూ... నేను లేకున్నా స‌భ జ‌రుగుతుంది త‌మ ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం విరిగిపోతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జేసీ దివాక‌ర్ రెడ్డి.
 
ఇక ఎట్ట‌కేల‌కు టీడీపీ అధినేత మ‌ఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జోక్యం చేసుకుని జేసీ దివాక‌ర్ రెడ్డికి ఫోన్ చేసి చ‌ర్చ‌కు ఖ‌చ్చితంగా హాజ‌రు కావాల‌ని సూచించారు. అయితే ఈ చ‌ర్చ‌కు తాను హాజ‌రు అయ్యేందుకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా అధినేత సూచ‌న‌ల మేర‌కు తాను ఈ రోజు హారుజ‌రు అవుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.
 
అయితే ఈ స‌భ‌లో కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియా గాంధీ జేసీ దివాక‌ర్ రెడ్డికి ఎదురు కాగా న‌మ‌స్క‌రించి ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ల్లీ రాష్ట్రాన్ని విభజించావ్... రెడ్ల‌కు తీర‌ని అన్యాయం చేశావ్ కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుని ఉన్న రెడ్లు నిలువునా మునిగారు అని వ్యాఖలు చేశారు. దీంతో సోనియా గాంధీ న‌వ్వుకుంటూ వెళ్లిపోయారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.