మ‌రోసారి బాబుపై జేసీ నిప్పులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and jc divakar reddy
Updated:  2018-08-25 05:57:23

మ‌రోసారి బాబుపై జేసీ నిప్పులు

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాజాగా క‌ర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన‌ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో ఉంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నిత్యం తాను ముఖ్య‌మంత్రిని పొగిడినా పొగ‌డ‌క పోయినా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
అంతేకాదు 2019 ఎన్నిక‌ల్లో తాను రాజ‌కీయాల నుంచి విర‌మించుకోవాల‌నుకున్నాన‌ని మ‌రోసారి జేసీ స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎంపీ కావాలి ఎమ్మెల్యే కావ‌ల‌నుకోలేద‌ని జేసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ త‌ర‌పున త‌న‌కు చంద్ర‌బాబు చేసేది ఏమి ఉండ‌ద‌ని తెలిపారు. కానీ పార్టీ త‌ర‌పున నిజాయితీ అనేది ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని అన్నారు.
 
ఈ స‌భ‌కు హాజ‌రు అయిన వారిలో చాలామంది పార్టీని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యాల‌ గురించి చెప్పాల‌నే ఉద్దేశంతో ఈ స‌భ‌కు వ‌చ్చాన‌ని లేక‌పోతే తాను అనంత‌పురం నుంచి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఈ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ వేస్ట్ అని మ‌రో సారి జేసీ బాంబ్ పేల్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.