సంచ‌ల‌నం సీఎం ర‌మేష్ ను మించిన మ‌రో టీడీపీ ఎంపీ నిరాహార దీక్ష‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 14:47:05

సంచ‌ల‌నం సీఎం ర‌మేష్ ను మించిన మ‌రో టీడీపీ ఎంపీ నిరాహార దీక్ష‌

2019 సార్వ‌త్రిక ఎన్నికలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మ‌రోసారి అధికారంలోకి రావాల‌నే ఉద్దేశ్యంతో విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాయ‌ల‌సీమ‌కు చెందిన టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ క‌డ‌ప ఉక్కును డిమాండ్ చేస్తూ సుమారు 11 రోజుల పాటు జెడ్పీ కార్యాల‌యంలో నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఆయ‌న చేసిన దీక్ష‌పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. సీఎం ర‌మేష్ కు బీపీ, షుగ‌ర్ ఉన్నా కూడా 11 రోజులు ఎలా నిరాహార దీక్ష చేస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్ధాయిలో విమ‌ర్శించాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌కులు త‌మ త‌ప్పును కేంద్ర‌ప్ర‌భుత్వంపై వేసేందుకు నిరాహాదీక్ష‌పేరుతో దొంగ‌దీక్ష‌లు చేస్తున్నార‌ని వైసీపీ ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు. 
 
సీఎం ర‌మేష్ దీక్ష‌లో ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఏంటంటే 11వ‌ రోజున ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మ‌ర‌సం ఇచ్చి నిరాహార దీక్షను విర‌మింపజేశారు. ఆ తర్వాత  సూమారు ఐదు నిమిషాల‌పాటు సీఎం ర‌మేష్ మీడియాతో మాట్లాడి మ‌రో సంచ‌ల‌నం సృష్టించారు. 11 రోజులు సాధార‌ణ మ‌నిషి కూడా నిరాహార దీక్ష చేయ‌లేరు కానీ ర‌మేష్ దీక్ష చేసి నిరాహాదీక్ష కు కొత్త అర్థం తీసుకువ‌చ్చారు.
 
ఇక ఇదే రీతిలో టీడీపీకి చెందిన మ‌రో ఎంపీ కూడా ఆమ‌ర‌ణ నిరాహాదీక్ష చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడు కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు విశాఖ రైల్వే జోన్ సాధ‌న‌ కోసం నిరాహార దీక్ష చేయ‌నున్నార‌ట‌. అయితే ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అనుమ‌తి ఇస్తే దీక్ష చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ దీక్ష వెలుగులోకి రావ‌డంతో మిగిలిన టీడీపీ నాయ‌కులు గుబులు పడుతున్నార‌ట‌. ఏదో ఒక రోజు అయితే దీక్ష చేయ‌వ‌చ్చు కానీ పొట్ట‌కాల్చుకుని సుమారు రెండు ప‌దిరోజుల‌కు పైగా తాము దీక్ష చేయ‌లేన‌మ‌ని బ‌హిరంగంగా చెబుతున్నార‌ట‌. ఏది ఏమైన‌ప్ప‌టికి సీఎం ర‌మేష్ ఎలా అయితే దీక్ష చేశారో తాను కూడా దీక్ష చేస్తాన‌ని రామ్మోహ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇక ఆయ‌న ప‌ట్టుద‌ల‌ను చూసి చంద్ర‌బాబు కూడా ఓకే చెప్పే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.
 
ఇక మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇదే జిల్లాలో ప‌ర్య‌టిస్తుండ‌టంతో ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. త్వ‌ర‌లో ప‌వ‌న్ కూడా విశాఖ రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నార‌ని వార్తలు వ‌స్తుండ‌టంతో టీడీపీ నాయ‌కులు రేపో మాపో నిరాహాదీక్ష చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ఈ వార్త వైసీపీ నాయ‌కులకు చేర‌డంతో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌కోసం ర‌మేష్ నిరాహార దీక్ష చేసి కొత్త‌పెళ్లి కొడుకులా నిగ‌నిగ‌లాడుతున్నార‌ని, ఇక రామ్మోహ‌న్ నాయుడు దీక్ష‌పై ఏ విధంగా కామెంట్స్ చేస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.