వెంక‌న్న చౌద‌రి తార‌ స్థాయితో కుల‌పిచ్చి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-25 12:32:58

వెంక‌న్న చౌద‌రి తార‌ స్థాయితో కుల‌పిచ్చి

తెలుగుదేశం పార్టీ నాయ‌క‌లు అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాలుగా ఉన్న‌ప్పుడు కులాల మ‌ధ్య చిచ్చు పెట్టి ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆదే క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల  విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత  అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు  ఏపీలో కూడా అదే ప‌ద్ద‌తిని ఫాలో అవుతున్నారు.
 
ఎప్ప‌టి నుంచో టీడీపీకి వ్య‌తిరేకంగా వ‌స్తున్న రెడ్ల కుల‌స్తుల‌ను ఎలాగైనా అణ‌గ‌తొక్కాల‌నే ఉద్దేశంతో చాలా కాలంగా సైకిల్ పార్టీ నాయకులు రెడ్డి వ‌ర్గాల‌ మ‌ధ్య చిచ్చుపెడుతూనే ఉన్నారు. కానీ వారి ఆగ‌డాల‌కు రెడ్డి వ‌ర్గాలు తెగించి నిల‌బ‌డుతున్నాయి. ఇక ఇప్పుడు కాపు కుల‌స్తులు టీడీపీకి వ్య‌తిరేకం కావ‌డంతో వారి మ‌ధ్య కూడా గొడ‌వ‌లు పెడుతున్నారు. ఇలా త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న కుల‌స్తుల‌ను టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు కులం పేరు చెప్పి ఇత‌ర కుల‌స్తుల మ‌ధ్య ప్ర‌త్య‌క్షంగా లేక ప‌రోక్షంగా గొడ‌వ‌లు పెడుతూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు.
 
ఇక ఈ మ‌ధ్య‌కాలంలో అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు కూడా మన కమ్మోళ్లే ఎల్లప్పుడూ అధికారం లో ఉండాలి అందుకు మనోళ్లు అంతా కష్టపడాలి అని ద్వారకా తిరుమలలో చెప్పారు. దీంతో పాటు టీడీపీ కి చెందిన ఓ నాయకుడు   కమ్మ మీటింగ్ లో బ్రహ్మ దేవుడు శివుడు విష్ణు కూడా కమ్మోళ్లే అని చెప్పుకొచ్చారు. 
 
అలాగే ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌న రెడ్డి  కూడా ఓ కార్య‌క్రంలో ఎస్సీల‌ను కించప‌రిచేలా మాట్లాడుతూ, ఎస్సీలు వారం అయినా స్నానం చేయ‌ర‌ని, వారికి రిజ‌ర్వేష‌న్లు దండ‌గ‌ని, వారికోసం ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా చ‌దువుకోర‌ని కించ‌ప‌రిచారు. ఇక‌ మొన్న‌టికి మొన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా ఎస్సీల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడుతూ, పుడుతూ పుడుతూ ఎవ‌రు ఎస్సీలుగా పుట్టాల‌ని కోరుకుంటార‌ని అన్నారు.
 
ఇక తాజాగా టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అని పిలుస్తూ మొన్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల గురించి మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ  బీజేపీకి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ వ్యాఖ్యానించారు. ఇలా టీడీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా కులం పేరుతో ప్ర‌చారం చేసుకుంటూ కులాల మ‌ధ్య‌చిచ్చుపెడుతూ అమాయ‌క ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌కొడుతున్నార‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే టీడీపీ ఎప్పుడు అధికారంలో వ‌స్తే అప్పుడు కుల‌లా మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.