ఆ వీడియోను ఎవ‌రు తీశారో గుర్తించాము

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 14:50:45

ఆ వీడియోను ఎవ‌రు తీశారో గుర్తించాము

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను డిమాండ్ చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ నిరాహార దీక్ష చేస్తున్న స‌మ‌యంలో స‌ద‌రు టీడీపీ ఎంపీలు ఈ దీక్ష‌పై అవ‌హేళ‌న చేస్తూ కెమెరాకు చిక్కిన సంగ‌తి తెలిసిందే.
 
అందులో ఒక ఎంపీ క‌డ‌ప‌కు జోన్‌ రాదు గీను రాదు అనిహేళ‌న చేస్తూ మాట్లాడితే, మ‌రో ఎంపీ అయినటువంటి ముర‌ళీ మోహ‌న్ నేను బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నాను నేను కూడా ఐదురోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాన‌ని చెప్పిన వీడియో  రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇక వీడియో పై ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ నాయ‌కుల‌తో పాటు సాధార‌న ప్ర‌జ‌లు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు
 
ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్రజాస్వామ్య నాయ‌కుడు ప్ర‌జ‌లు బాగోగులు చూసుకోవాలి త‌ప్ప ఇలా పార్టీలో ఉన్న నాయ‌కులను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడుతున్నార‌ని సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు అయితే అస‌లు టీడీపీ నాయ‌కులు ప్ర‌జాస్వామ్య నాయ‌కులేనా.. అని ప్రశ్నిస్తున్నారు.
 
తాజాగా ఈ విష‌యంపై టీడీపీ ఎంపీ ముర‌ళి మోహ‌న్ స్పందించారు. తాము మాట్లాడుకున్న వీడియో ఎవ‌రు తీశారో గుర్తించామని ఇది కోవ‌ర్టుల ఆప‌రేష‌న్ కాద‌ని ఇంకా ఎవ‌రో ఉన్నార‌ని వారిని త్వ‌ర‌లో గుర్తించి చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత తాము ఏదీ మాట్లాడినా కూడా కెమెరాకు చిక్కితే విప‌రీత అర్థాలు వ‌స్తాయ‌నే ఉద్దేశ్యంతో జాగ్ర‌త్త పాటిస్తున్నామ‌ని ఎంపీ ముర‌ళి మోహ‌న్ తెలిపారు 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.