క్ష‌మించండి త‌ప్పుచేశాను టీడీపీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 16:18:44

క్ష‌మించండి త‌ప్పుచేశాను టీడీపీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు రాజ‌మండ్రిలో టీడీపీ నాయ‌కులు మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. 
 
ఈ స‌భ‌కు టీడీపీ ఎంపీ మురళీ మోహన్ హాజ‌రు అయ్యారు, ఆ త‌ర్వాత ఆయ‌న స‌భ‌లో ప్ర‌సంగిస్తూ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ నాయ‌కులు ఎన్ని మ‌త‌ల‌బులు చేసిన‌ప్ప‌టికీ బీజేపీ నాయ‌కుల‌కు మెజార్టీ రాక‌పోవ‌డానికి సాక్షాత్తు మా వెంక‌న్న చౌద‌రినే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.
 
టీడీపీ నాయ‌కులు సాక్షాత్తు క‌లియుగ దైవం అయిన‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని వెంక‌న్న చౌద‌రి అని ఎంపీ ముర‌ళీ మోహ‌న్ పిలువ‌డం ఏంట‌ని విమ‌ర్శించారు. అయితే ఆ మ‌రుస‌టిరోజే ఆయ‌న తాను అన్న మాట‌ను వెన‌క్కి తీసుకున్నారు. తాను కావాల‌నే అలా అన‌లేద‌ని వెంక‌న్న చౌద‌రి అనే వ్య‌క్తితో స‌భ‌కు హాజ‌రు కాక‌ముందు మాట్లాడి వ‌చ్చినందున అదే పేరు పొర‌పాటున అన్నాన‌ని తెలిపిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా క‌డ‌ప ఉక్కు సాధ‌న కోసం టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ నిరాహాదీక్ష చేస్తుంటే ఈ దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపి ఈ రోజు తిరుప‌తిలో వెంక‌న్న‌ను ద‌ర్శ‌నం చేసుకున్నారు. ద‌ర్శ‌నం అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను చేసిన పొర‌పాటును క్ష‌మించ‌మ‌ని వెంక‌టేశ్వ‌ర స్వామిని కోరుకున్నాన‌ని ముర‌ళీ మొహ‌న్ స్ప‌ష్టం చేశారు. నేను కావాల‌ని అనలేద‌ని అది పొర‌పాటున‌ అన్నాన‌ని, న‌న్ను మన్నించు స్వామీ అంటూ వేడుకున్నానని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.