ఆమ‌ర‌ణ దీక్ష‌కుదిగిన టీడీపీ ఎంపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp ramesh
Updated:  2018-06-20 10:37:49

ఆమ‌ర‌ణ దీక్ష‌కుదిగిన టీడీపీ ఎంపీ

క‌డ‌ప జిల్లాలో ఉక్కుప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఏపీ అధికార‌ తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ ఈ రోజు ఉద‌యం నుంచి ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు దిగారు. ఆయ‌న చేస్తున్న నిరాహార దీక్ష‌కు ఉక్కు దీక్ష అనే పేరు కూడా పెట్టారు. ఇక దీక్ష క‌డ‌ప జిల్లా జేడ్పీ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేశారు. పొట్లదుర్తి నుంచి బారీ ర్యాలీతో సీఎం ర‌మేష్ జేడ్పీ ప్రాంగ‌ణానికి చేరుకుని దీక్ష‌లో పాల్గొన్నారు.
 
ఇప్ప‌టికే ర‌మేష్ క‌డ‌పలో స్టీల్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని కోరుతూ రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ లేఖ‌లో  ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించాలని కూడా ఆయన కోరారు. కేంద్రం ప్లాట్ ను ఏర్పాటు చేయ‌క‌పోతే తాను నిరాహార ధీక్ష చేస్తాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు.
 
ఇక కేంద్రం నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ నిరాహార దీక్ష‌కు దిగారు. ఈ దీక్ష‌లో ప్ర‌ధానంగా క‌డపతో పాటు బయ్యారంలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసే దిశగా పరిశీలించాలని. అది విభ‌జ‌న చ‌ట్టంలో పొంద‌ప‌రిచిన అంశాలుగా ప్ర‌స్తావిస్తు ర‌మేష్ దీక్ష చేస్తున్నారు. ఇక మ‌రోవైపు ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు కూడా నిన్న‌టినుంచి దీక్ష చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.