సీఎం అక్ర‌మ సారాయి చ‌రిత్ర న‌మ్మ‌లేని నిజాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-23 12:17:01

సీఎం అక్ర‌మ సారాయి చ‌రిత్ర న‌మ్మ‌లేని నిజాలు

ప్ర‌తిక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సారెడ్డి మ‌రోసారి సోస‌ల్ మీడియా పేస్ బుక్ ను వేదిక‌గా చేసుకుని అధికార తెలుగుదేశంపార్టీ ఎంపీ సీఎం రమేష్ ఒక ఘరానా మోసగాడు అని పోస్ట్‌ చేశారు. ర‌మేష్ నాయుడు కల్తీ సారా సామ్రాజ్యంతో కోట్లకు పడగలు వేశార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.
 
1. 1986లో చిత్తూరు పట్టణంలోని మన్మోహన్ బిల్డింగ్స్ అనే అద్దె నివాసం నుంచి సీఎం రమేష్ తన తండ్రి మనిస్వామి నాయుడుతో కలిసి దొంగ సారా వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు.
 
2. అప్పట్లో రమేష్ ఇండ్-సుజికి బైక్పై తిరుగుతుండేవారు.
 
3. రమేష్ తండ్రి మునిస్వామి నాయుడుకి స్థానికుడైన హరి ప్రసాద్ అనే సారా కాంట్రాక్ట‌ర్ తో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయనతో కలిసి చిత్తూరు టౌన్లోని కొండమిట్ట ప్రాంతంలోగల ఆనంద థియేటర్ వెనుక మునిస్వామి, రమేష్ సారా వ్యాపారం ప్రారంభించారు.
 
4. ఈ క్రమంలోనే తమ దగ్గర పని చేసే ధనుంజయుడు అనే గుమస్తా సాయంతో సీఎం రమేష్, అతని తండ్రి మునిస్వామి ఏకంగా సారా ప్యాకెట్లు తయారు చేసే మిషన్లను ఏర్పాటు చేసి నాటు సారా తయారీ మొదలెట్టారు.