త‌వ్వేకొద్ది ఆస్తులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp ramesh
Updated:  2018-10-13 10:49:14

త‌వ్వేకొద్ది ఆస్తులు

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ సీఎం ర‌మేష్ ఇంటిపై ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు నిన్న ఉద‌యం నుంచి వైఎస్సార్ జిల్లా పొట్ల‌దుర్తి, విజ‌య‌వాడ‌ హైద‌రాబాద్ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ సోదాలను అధికారులు అర్థ‌రాత్రి వ‌ర‌కు నిర్వ‌హించి ప‌లుకీల‌క‌మైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం రిత్వీక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధికారులు సోదాలు చేస్తున్నారు.
 
అర్థ‌రాత్రి స‌మ‌యంలో సీఎం ర‌మేష్ బావ గోవ‌ర్థ‌న్ రోడ్ నెం.12లో నివాసం ఉంటున్న ఇంట్లో అధికారులు సోదాలు చేసి విలువైన ప‌త్రాల‌ను అలాగే న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ర‌మేష్ కు చెందిన రెండు లాక‌ర్ కీల‌ను బ్యాంకు అధికారుల‌తో ఓప‌న్ చేయించుకుని సోదా చేశారు. ఆ త‌ర్వాత రిత్విక్ కార్యాలాయానికి గోవ‌ర్థ‌న్ నాయుడుని త‌ర‌లించారు. 
 
త‌న బావ మ‌రిది ర‌మేష్ కు గోవ‌ర్థ‌న్ ఫైనాన్స్ వ్య‌వ‌హారం మొత్తాన్ని ఈయ‌నే చూసుకుంటున్నందున ఐటీ అధికారులు గోవ‌ర్థ‌న్ నాయుడును అదుపులో తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సోదాలు ఓ కొలిక్కి రానందున మ‌రో రోజుకూడా సీఎం ర‌మేష్ సంస్థ‌ల‌పై ఐటీ దాడులు జ‌రిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

షేర్ :