టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mp ramesh
Updated:  2018-06-16 15:58:18

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం ఇప్పుడు ఏపీలో ఇటు రాజ‌కీయ పార్టీలు అన్ని స‌మ‌రశంఖం పూరించాయి...ముఖ్యంగా నాలుగు సంవ‌త్స‌రాలు సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఇదే ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం పారాటానికి దిగింది....కేంద్రంతో నాలుగేళ్లు స‌యోధ్య‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎటువంటి నిర్ణ‌యం కేంద్రం తీసుకునేలా  ఈనాలుగేళ్ల‌లో ముంద‌డుగు సాధించ‌లేక‌పోయింది..
 
మోదీ, అమిత్ షాతో ఆ నాడే క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌కై సాధ‌న చేసి ఉంటే, ప్ర‌తిఫ‌లం ఉండేద‌ని ఇప్పుడు ఎటువంటి లాభం లేదు అని, ఇటు క‌డ‌ప వాసులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. నాలుగేళ్లుగా నిశ్శ‌బ్దంగా ఉన్న తెలుగుదేశం ఇప్పుడు స‌రికొత్త‌గా ఆలోచిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.
 
ఈ స‌మ‌యంలో టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ ఈనెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే జిల్లా నాయ‌కులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు....కడప జిల్లా పరిషత్‌ ఆవరణంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. సీఎం ర‌మేష్ వ‌ర్గీయులు అలాగే ఆమరణ దీక్షా శిబిరం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.. ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న రాక‌పోయినా జిల్లా తెలుగుదేశం నాయ‌కుల‌కు దీనిపై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 
 
ఇక్క‌డ ప్రత్యేక విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేర ఫీజు చెల్లిస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేదుకు జిల్లా పరిషత్‌ ఆవరణను ఆమరణ దీక్షా శిబిరానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది..
 
తొలిరోజు పెద్ద సంఖ్యలో టీడీపీతో సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చివ‌రి నిమిషంలో టీడీపీ అనేక జిమ్మికులు చేస్తుంది అని తెలిసిందే ఇందులో భాగంగా చంద్ర‌బాబు కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తున్నార‌ని త‌మ నాయ‌కుల‌తో కొత్త ప్ర‌చారం చేయిస్తున్నారు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

1 Comment

  1. yes this is drama

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.