టీడీపీ ఎంపీల వీడియోను లీక్ చేసింది ఆయ‌నే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-30 16:54:08

టీడీపీ ఎంపీల వీడియోను లీక్ చేసింది ఆయ‌నే

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఈ మ‌ధ్య‌కాలంలో ఏ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టినా దానికి వ్య‌తిరేక శ‌క్తులు త‌లెత్తుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల‌ విభ‌జ‌న జ‌రిగిన‌ త‌ర్వాత 2014లో మొద‌టిసారిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సుమారు ఆరువంద‌ల‌కు పైగా అమ‌లు చేయ‌లేని హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చారు.
 
అయితే వారు అధికారంలోకి వ‌చ్చినప్ప‌టినుంచి టీడీపీ పరిపాల‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదాను తెర‌పైకి తీసుకురావ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసేది ఏం లేక కేంద్రంతో నాలుగు సంవ‌త్స‌రాలు మిత్రప‌క్షంగా ఉన్న ఆయ‌న ఒక్క‌సారిగా ఆ మిత్ర‌ప‌క్షానికి క‌టీఫ్ చెప్పి ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ నాయ‌కులు పోరాటం చేస్తున్నారు.
 
ఇక ఈ క్ర‌మంలో అసెంబ్లీ చివ‌రి స‌మావేశాలు రానేవ‌చ్చాయి. ఈ స‌మావేశంలో కూడా జ‌గ‌న్ కోరిక మేర‌కు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ఈ అవిశ్వాస తీర్మ‌నానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌మ ఎంపీల‌తో మ‌ద్ద‌తు చేయిస్తామ‌ని చెప్పి చివ‌ర్లో మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా హ్యండిచ్చారు. దీంతో వైసీపీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదాకోసం ఒంటెద్దు పోరాటం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ తెర‌పైకి రావ‌డంతో అధికార పార్టీ నాయ‌కులు, ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు దీక్ష‌లు చేస్తూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. 
 
ఈ క్ర‌మంలో ఉక్కు సాధ‌న‌కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి త‌ల‌నొప్పిగా మారింది. దీంతో చంద్ర‌బాబు, ఎంపీ సీఎం ర‌మేష్ తో అలాగే ఎమ్మెల్సీ బిటెక్ ర‌విల‌తో నిరాహాదీక్ష చేయించారు. కొద్దిరోజుల క్రితం ఈ దీక్ష‌కు మ‌ద్దుతు తెలుప‌డానికి వ‌చ్చిన‌ టీడీపీ ఎంపీలు స‌భా ముఖంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్ర‌బాబు ఉంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రాదు, ఉక్కు ప‌రిశ్ర‌మ‌రాదని జేసీ దివాక‌ర్ రెడ్డి తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు లింగు లింగుమ‌ని సీఎం ర‌మేష్ దీక్ష‌లు చేస్తే రాష్ట్రానికి ఉక్కుప‌రిశ్ర‌మ రాదు తుక్కు ప‌రిశ్ర‌మ కుడా రాద‌ని ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ఉక్కు పరిశ్ర‌మ కోసం టీడీపీ ఎంపీలు కేంద్ర‌మంత్రితో చ‌ర్చించేందుకు ఢిల్లీకి ప్ర‌యాణం చేశారు. ఆక్క‌డ ఎంపీలంద‌రు స‌మావేశం అయి పిచ్చ‌పాటిగా మాట్లాడుకుంటూ రైల్వే జోన్, క‌డ‌ప ఉక్కు ఉద్య‌మాల‌పై అలాగే సీఎం ర‌మేష్ చేసిన నిరాహార దీక్ష గురించి వేసిన సెటైర్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారి వారిని అవ‌స్థ‌వాల్లోకి నెట్టేశాయి. ఇక ఈ విష‌యంపై చంద్ర‌బాబు నాయుడు కూడా ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. 
 
తాజాగా ఈ వీడియోను ఎవ‌రు లీక్ చేశారో తేలిపోయింది. మీరు ఊహించుకున్న‌ట్లు ప్ర‌ధాన ప్ర‌తిక్ష వైసీపీ నాయ‌కులు కాదు, కేంద్ర ప్ర‌భుత్వ‌ము కాదు. స్వ‌యాన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీనే ఈ వీడియోను లీక్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాయ‌ల‌సీమ‌కు చెందిన ఆ ఎంపీకి సీఎం ర‌మేష్ కు చాలాకాలంగా ప‌డ‌టంలేదు. అందుకే అత‌ని దీక్ష‌పై టీడీపీ ఎంపీల అభిప్రాయాలు ఏవిధంగా ఉన్నాయే సీక్రెట్ గా రికార్డ్ చేసి సోష‌ల్ మీడియా లో పోస్ట్ చేయించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడేమో ఈ విడియోపై విచార‌ణ జ‌రిపించి ఎవ‌రైతే పోస్ట్ చేశారో వారిని అదుపులో తీసుకుంటామ‌ని అంటున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే గ్రామ పెద్ద‌లు అప్పుడ‌ప్పుడూ ఒక సామెత అంటూ ఉండే వారు సంక‌లో పిల్లిని పెట్టుకుని ఊరంత వెతికిన‌ట్లు చంద్ర‌బాబు నాయుడు కూడా ఇంట్లో దొంగ‌ని పెట్టుకుని రాష్ట్ర‌మంతా వెతుకుతున్నారని చాలా మంది భావిస్తున్నారు. చుద్దాం ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.