వీళ్లంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి నో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 15:12:50

వీళ్లంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి నో

2019లో హోరా హోరీగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌స్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు రిటైర్మెంట్ తీసుకునే ఆస్కారం క‌నిపిస్తోంది. ఒకరు ఇద్ద‌రు అయితే పార్టీకి పెద్ద‌గా న‌ష్ట‌మేమి ఉండ‌దు కానీ విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకుని త‌మ‌ కుమారుల‌ను టీడీపీ త‌ర‌పున ఎంపీ, ఎమ్మెల్యేలుగా బ‌రిలోకి దింపాల‌ని చూస్తున్నార‌ట‌. అయితే మందుగానే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చెయ్య‌న‌ని రిటైర్మెంట్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స్థానాన్ని త‌న కుమారుడు ప‌వ‌న్ రెడ్డి భ‌ర్తి చేస్తార‌ని చాలా రోజుల క్రిత‌మే డిక్లేర్ చేశారు.
 
ఇక అదే జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి ప‌రిటాల సునిత వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ కుమారుడు ప‌రిటాల శ్రీరామ్ ను టీడీపీ త‌ర‌పున పోటీ చేయించాల‌ని చూస్తుంది. అవ‌సరం అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన నియోజ‌వ‌ర్గాన్ని కూడా త్యాగం చేసేందుకు సిద్ద‌మ‌య్యారు ప‌రిటాల సునిత‌. ఇక ఆమె కూడా ద‌రిదాపు రిటైర్మెంట్ ప్ర‌త్య‌క్ష్యంగా కాకుండా ప‌రోక్షంగా ప్ర‌క‌టించినట్లే అని విస్వ‌స‌నీయ వ‌ర్గాలు అంటున్నాయి. 
 
ఇక పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వర్గ ఎమ్మెల్యే ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డిని కూడా చంద్ర‌బాబును రిటైర్మెంట్ ఇవ్వ‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న స్థానంలో త‌న‌యుడు బ‌రిలోకి దిగే అవ‌కాలు క‌నిపించ‌డంలేదు. ఒకవేళ‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి తాను పోటీ చేస్తాన‌ని చెబితే క‌నుక ముఖ్య‌మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డికి చివ‌రి సారి అవ‌కాశం ఇచ్చే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.
 
ఇక క‌ర్నూల్ జిల్లా విష‌యానికి వ‌స్తే ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఏపీ డిప్యూటీ ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి ఇప్ప‌టికే డిక్లేర్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చెయ్య‌న‌ని త‌న‌కు బ‌దులు త‌న కుమారుడు కేఈ శ్యాంబాబు పోటీ చేస్తార‌ని చెప్పారు. ఇక చంద్ర‌బాబు కూడా శ్యాంబాబు పోటీకి ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌న ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో విస్రృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. 
 
అయితే ఇప్ప‌టికే వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో కేఈ శ్యామ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు ఆయ‌న‌పై కేసు కూడా నమోదైంది. ఇక నంద్యాల విష‌యానికి వ‌స్తే ఎంపీగా ఎస్పీవై రెడ్డి ఎంపీగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఖ‌చ్చితంగా పోటీ చెయ్య‌రు. ఒకవేళ‌ ఆయ‌నను పోటీ చెయ్య‌మ‌ని చంద్ర‌బాబు ఆదేశించినా కూడా ఆయన‌కు వ‌య‌స్సు స‌హ‌క‌రించ‌దు సో.. ఆయ‌న స్థానంలో త‌న వార‌సుల‌ను భ‌ర్తి చేయించ‌నున్నారు
 
ఇక చిత్తూరు జిల్లా విష‌యానికి వ‌స్తే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల కూడా వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ చెయడని తెలుస్తోంది. ఆయ‌న స్థానంలో ఆయ‌న కుమారుడుని బ‌రిలోకి దించేందుకు సిద్ద‌మ‌య్యారు. అంతేకాదు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నుంచి కూడా త‌న కుమారుడు పోటీకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇక క‌డ‌ప జిల్లా విష‌యానికి వ‌స్తే ప్రొద్దుటూరు నియోజ‌వ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ప‌ర‌పున వ‌ర‌ద‌రాజులు రెడ్డి పోటీ చెయ్య‌ర‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఆయ‌న వ‌య‌స్సు కూడా బ‌హూశా స‌హ‌క‌రించ‌క‌పోవ‌చ్చు అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున తన కుమారుడిని బ‌రిలోకి దింపేందుకు సిద్ద‌మ‌య్యారు వర‌ద‌రాజులు. 2019లో రాజ‌కీయ‌నాయ‌కుల కుమారులు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాబోతున్నారు. చూద్దాం వీరంద‌రూ టీడీపీ జెండాను ఎంత‌మేర‌కు ఆక‌ర్షిస్తారో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.