టీడీపీ ఎంపీలు కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp  mps  decision  on ap special status fight
Updated:  2018-03-02 04:57:48

టీడీపీ ఎంపీలు కీల‌క నిర్ణ‌యం

ఏపీ కేంద్రం ద‌గ్గ‌ర ఎటువంటి ప‌రిస్దితుల్లో ఉందో తెలిసిందే... ఇటు ఏపీకి కేంద్రం ఎటువంటి నిధులు ఇవ్వ‌డం లేద‌ని తెలుగుదేశం అంటుంటే ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్ప‌డానికి ఎందుకు  జంకుతున్నారు అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఇక తాజాగా వైసీపీ కీల‌క ప్ర‌క‌టన చేసింది.కేంద్రం ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌క‌పోతే మా ఎంపీలు రాజీనామా చేస్తారు అని, అలాగే అవిశ్వాస‌తీర్మానం పెడ‌తారు అని తెలిపింది. దీంతో తెలుగుదేశం స‌ర్కార్ డైల‌మాలో ప‌డింది.
 
 
తాజాగా తెలుగుదేశం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా చంద్ర‌బాబు అమిత్ షా మోదీ వ‌ల‌లో చిక్కుకున్నారు అని అన్నారు. ఇక శ్రీకాకుళం ఎంపి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు.రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. తాజాగా తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌రిగింది.. చంద్రబాబు ఎంపీల‌కు పార్లమెంట్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు తెలియ‌చేశారు. బీజేపీ రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్ర‌త్యేక హూదా కు అడ్డంకులు ఉన్నాయి అని ప్యాకేజీకి ఒప్పుకున్నామ‌న్నారు చంద్ర‌బాబు. అవ‌స‌రం అయితే కోర్టుకు కూడా వెళ‌తామ‌ని ప్ర‌త్యేక హూదా ఇవ్వాల్సిందే అని గ‌ల్లా జ‌య‌దేవ్ డిమాండ్ చేశారు.
 
 
అలాగే వైసీపీతో క‌లిసి అవిశ్వాసం పెడితే ఇటు క్రెడిట్ వైసీపికి ద‌క్కుతుంది.. అలాగ కాకుండా వైసీపీ ని ఇర‌కాటంలో పెట్టాలి అంటే తాము కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాం అని మ‌ద్ద‌తు లేదు అని ప్ర‌క‌టించాలి. అయితే స‌మావేశాలు ప్రారంభం అయిన త‌ర్వాత టీడీపీ ఎంపీలు ఆందోళ‌న చేయాలి అనిభావించారు.. ఈ స‌మ‌యంలో కూడా కేంద్రం నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోతే, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మొత్తానికి తెలుగుదేశం  స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డేకొద్ది కౌంట్ డౌన్ గా నిర్ణ‌యాలు తీసుకుంటోంది అనేది తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.