బ్రేకింగ్... జేసీతో పాటు మ‌రో ముగ్గురు టీడీపీ ఎంపీలు రేపు డుమ్మా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-19 06:00:34

బ్రేకింగ్... జేసీతో పాటు మ‌రో ముగ్గురు టీడీపీ ఎంపీలు రేపు డుమ్మా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు టీడీపీ ఎంపీలు నిన్న పార్ల‌మెంట్ స‌మావేశంలో కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ అవిశ్వాస తీర్మానంపై రేపు చ‌ర్చ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఆ పార్టీ ఎంపీల‌కు విప్ ను జారి చేశారు. 
 
అయితే ఈ విప్ కు తాను హాజ‌రు కానంటూ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు త‌న‌కు హిందీ, ఇంగ్లీష్‌ రాద‌ని అందుకే తాను పార్ల‌మెంట్ కు వెళ్ల‌న‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో ఒక‌రు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన‌ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. 
 
టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై రేపు చ‌ర్చ జ‌రుగ‌నున్న త‌రుణంలో ఎస్పీవై రెడ్డి ఇంకా నంద్యాల‌లోనే ఉన్నారు. ఆయ‌న ఢిల్లీకి వెళ్లాల‌ని ఉన్నా కూడా  ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌పోవ‌డంతో ఢిల్లీ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారట‌. ఇక టీడీపీ అధిష్టానం కూడా ఆయ‌న‌పై సానుకూలంగా ఉంద‌ట‌. అంతేకాదు ఆ మ‌ధ్య హోరా హోరిగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా పార్టీ నిర్ణ‌యం మేర‌కు వీల్ చైర్ లో కూర్చోని ప్ర‌చారం చేశారు. 
 
ఇక ఆయ‌న సంగ‌తి ప‌క్కన‌ పెడితే ఇక మిగిలిన ఇద్ద‌రు ఎంపీల పరిస్థితి గురించి టీడీపీ అధిష్టానానికి అంతుచిక్క‌డం లేద‌ట‌. కేంద్రానికి వ్య‌తిరేకంగా ఆ ఇద్ద‌రి ఎంపీల‌కు అవిశ్వాస తీర్మానం పెట్టాటం ఇష్టం లేద‌ని కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేరకు అవిశ్వాసంపై సంత‌కం చేశార‌ట‌. చూద్దాం ఇంకొద్ది గంట‌లు మాత్ర‌మే టైమ్ ఉంది ఈ ఇద్ద‌రికి ఇంకా ఇద్దరు తోడు అవుతారా లేక ఇష్టం లేకున్నా చంద్రబాబు ఆదేశాల మేర‌కు మ‌ళ్లీ హాజ‌రు అవుతారా అనేది చ‌ర్చ‌గా మారుతోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.