షాకిచ్చిన టీడీపీ ఎంపీలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp mps chandrababu naidu
Updated:  2018-04-10 04:36:55

షాకిచ్చిన టీడీపీ ఎంపీలు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే... జ‌గ‌న్ యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి టీడీపీ పై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌న్న నేప‌థ్యంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రో కొత్త  ప్లాన్ వేశారు...  ప్లాన్ అయితే వేశారు కానీ అది అమ‌లు ప‌ర‌చ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని తెలుస్తోంది.
 
ఇంత‌కు విష‌యం ఏంటంటే... విభ‌జ‌న హామీల్లో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా పోరాటం పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌ణ  క‌ల్పించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీడీపీ త‌ర‌పున బ‌స్సు యాత్ర‌ను మొద‌లు పెట్టాల‌నుకున్నారు... ఈ యాత్ర‌కు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్దం చేసి ఢీల్లీ లో ఉన్న త‌మ ఎంపీలంద‌రిని  అమ‌రావ‌తికి పిలిపించి అత్య‌వ‌స‌ర అమావేశం ఏర్పాటు చేశారు చంద్ర‌బాబు.
 
ఈ స‌మావేశంలో ప్ర‌తీ ఒక్క‌రు బ‌స్సు యాత్ర‌లో పాల్గొని రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఎంత ముఖ్య‌మో వివ‌రించాల‌ని టీడీపీ ఎంపీల‌కు సూచించారు... అయితే అధినేత ప్రతిపాదించిన బస్సు యాత్రకు ఎంపీలు సముఖంగా లేకపోవడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీంతోపాటు మంగళవారం ఎంపీలతో జరగాల్సిన సమావేశం కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది.
 
రెండు, మూడు రోజుల్లో ఎంపీల బస్సు యాత్ర అంటూ హడావుడి చేసిన చంద్రబాబుకు ఎంపీలు ...యాత్రకు సుముఖంగా లేకపోవడంతో తదుపరి కార్యాచరణ దిశగా పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.... కాగా ఈ యాత్ర ద్వారా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును దృష్టిని మ‌ళ్లించేందుకు చేస్తున్నార‌ని విస్వ‌శ‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.