టీడీపీ నంద్యాల‌ ఎంపీ టికెట్ మాజీ పోలీస్ అధికారికేనా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 12:00:38

టీడీపీ నంద్యాల‌ ఎంపీ టికెట్ మాజీ పోలీస్ అధికారికేనా

క‌ర్నూల్ జిల్లాలో  క‌ర్నూల్, నంద్యాల ఈ రెండు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు రాష్ట్ర రాజ‌కీయాల్లో కీలంగా ఉంటాయి. క‌ర్నూల్ ఎంపీ సెగ్మెంట్ లో బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు అభ్య‌ర్థులు గెలుపు ఓట‌మిలను ప్రభావాన్ని చూపుతాయి. ఇక నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ప్ర‌భావితం చూపుతాయి. నంద్యాల పార్ల‌మెంట్ కు ఇప్ప‌టివ‌ర‌కు మూడు ఉపఎన్నిక‌ల‌తో పాటు 22 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే అందులో 12 సార్లే రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచే ఎంపీగా ఎంపీక అయ్యారు. 
 
దీంతో నంద్యాల పార్ల‌మెంట్ స్థానానికి ఏ పార్టీ అయినా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు ప్రాధాన్య‌త ఇస్తుంటాయి. 2019 ఎన్నిక‌ల్లో నంద్యాల పార్ల‌మెంట్ స్థానానికి టీడీపీ అభ్య‌ర్ధిగా మాజీ పోలీస్ అధికారి శివానంద‌రెడ్డి పేరు దాదాపు ఖ‌రారు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే నందికొట్కురూకు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న సివానంద‌రెడ్డి ఎస్పీ హోదాలో స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌న చేశారు. 
 
ఈయ‌న‌కు రాజ‌కీయ కుటుంబ నేప‌థ్యం ఉంది. ఆయ‌న తండ్రి గిడ్డారెడ్డి గ‌తంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.అంతేకాదు పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరుచ‌రిత భ‌ర్త గౌరు వెంక‌ట రెడ్డి శివానంద‌రెడ్డికి స్వ‌యాన భావ. 2014 ఎన్నిక‌లకు ముందు శివానంద‌రెడ్డి త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌టంతో వ‌చ్చేఎన్నికల్లో టీడీపీ త‌ర‌పున శివానంద‌రెడ్డిని పోటీ చేయించేందుకు ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సిట్టంగ్ ఎంపిగా ఉన్న ఎస్పీవై రెడ్డి వైసీపీ త‌ర‌పున గెలిచి ఆ త‌ర్వాత అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అయితే ప్ర‌స్తుతం అనారోగ్యం, వ‌యే వృద్ది స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతండ‌టంతో ఆసీటు శివానంద‌రెడ్డికి ఖాయం చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఎస్సీవై రెడ్డి అనుచ‌రులు ఎవిదంగా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.