ముదిరిన వార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-24 18:19:44

ముదిరిన వార్

వశిష్ట గోదావ‌రి ప్రాంతం టీడీపీ కంచుకోట‌గా చెప్పుకునే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తాజాగా వివాదాలు వ‌చ్చాయి..గ‌తంలో ఇంటింటికి టీడీపీ విష‌యంలో ఇక్క‌డ నాయ‌కులు డ్యాన్సులు వేయ‌డం ప‌ట్ల రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చించుకున్నారు.. ఇక కొత్త ఎమ్మెల్యే ఇటువంటి నాయ‌కుల ప‌ట్ల  చర్య‌లు తీసుకోవాలి అని అక్క‌డ ప్ర‌జ‌లు కూడా ప్ర‌శ్నించారు...ఇక్క‌డ తెలుగుదేశం త‌ర‌పున బండారు మాథ‌వ‌నాయుడు వ‌ర్గం ఉంటే మ‌రోప‌క్క మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు వ‌ర్గం రెండు వ‌ర్గాలుగా ఉంది... ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున మాత్రం ముదునూరి ప్ర‌సాద‌రాజు  పార్టీలో ముందుకు వెళుతున్నారు.
 
ఇక తాజాగా ఇక్క‌డ టీడీపీలో చీలిక వ‌చ్చింది. న‌ర‌సాపురం చైర్ ప‌ర్స‌న్  రత్నమాలతో పాటు 16 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో  తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. ఊహించని విధంగా వీరు అత్యవసరంగా సమావేశమై రాజీనామాలు ప్రకటించడం పార్టీ అధిష్టానాన్ని సైతం విస్మయానికి గురి చేసింది. 
 
ఈ జిల్లా టీడీపీలో ఇటీవ‌ల ముస‌లం పెరిగింది అనే చెప్పాలి... ఇక మంత్రి జ‌వ‌హార్ అలాగే దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని వివాదాలు... గోపాల‌పురం టీడీపీలో వ‌ర్గ‌విభేదాలు మొద‌లైన‌వి అధిష్టానాని కాస్త ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి జిల్లా నుంచి... అయితే ప్ర‌త్యేక హూదా కోసం కేంద్రం పై పోరాటం చేస్తున్న స‌మ‌యంలో పార్టీలో ఇటువంటి ఇబ్బంది రావ‌డం పై తెలుగుదేశం అధిష్టానం షాక్ కు గురైంది.
 
కొందరు నేతలు కౌన్సిలర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు  వెనక్కితగ్గలేదు. పార్టీ నేతలు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా దానిపై ఆరా తీసే పనిలో పడ్డారు. ఇప్పటికే నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. పార్టీ అధినాయకులు ఈ వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం పార్టీలో హాట్‌టాఫిక్‌గా మారింది. నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఈ అంశంపైనే చర్చ సాగుతోంది...కొంతకాలంగా డీఈ శ్రీకాంత్‌ వ్యవహారంపై కౌన్సిల్‌లో కొందరు సభ్యులు గుర్రుగా ఉన్నారు. అదే చివ‌ర‌కు రాజీనామాల‌కు దారి తీసింది.
 
మున్సిప‌ల్ ప‌నులు స‌కాలంలో చేయ‌డం లేద‌ని మున్సిప‌ల్ ఉన్న‌తాధికారుల‌కు  ఫిర్యాదు చేశారు కౌన్సిల్ త‌ర‌పున ..చివరికి కౌన్సిల్‌లో ఓటింగ్‌ పెట్టి డీఈని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త డీఈని వేస్తారని ఎదురుచూశారు నేత‌లు . అయినా ప్రభుత్వం తిరిగి శ్రీకాంత్‌నే ఇక్క‌డ‌ నియమించింది.
 
సభ్యులు రెండు రోజులుగా మల్లగుల్లాలు పడ్డారు. ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై తర్జనభర్జనలు చేశారు. స‌ర్కారు నిర్ణ‌యం పై ప్ర‌శ్నించారు ఇంత  ఒత్తిడి ఉన్నా ఇక్క‌డ మ‌ళ్లీ పోస్టింగు ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే కూడా సైలెంట్ గా ఉండ‌టంతో జిల్లా మంత్రులు రంగంలోకి దిగారు... ఏకంగా సీఎం వ‌ర‌కూ ఈ పంచాయితీ వెళ్లింది అని తెలుస్తోంది మ‌రి చూడాలి దీనికి ఎలా పుల్ స్టాప్ పెడ‌తారో..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.