తెర‌పై టీడీపీ కొత్త డ్రామా టైలిల్ ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-16 17:28:29

తెర‌పై టీడీపీ కొత్త డ్రామా టైలిల్ ఇదే

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుపరిచిన ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ అలాగే విశాఖ రైల్వే జోన్ సాధించ‌డంలో అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఘోరంగా విఫ‌లం అయ్యార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జలు కూడా భావిస్తున్నారు. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో  ఈ విష‌యాన్ని క‌ప్పిపుచ్చి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు నానాపాట్లు ప‌డుతున్నారు పార్టీ నాయ‌కులు.
 
అందులో భాంగంగానే కేంద్ర ప్ర‌భుత్వం అవిశ్వాస తీర్మానం అంటూ మ‌రో కొత్త నాట‌కానికి తెర‌లేపింది అధిష్టానం. ప్ర‌త్యేక హోదా విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నారు టీడీపీ ఎంపీలు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు నాలుగు సంవ‌త్స‌రాలు అంట‌కాగ‌డ‌మేకాదు మంత్రి ప‌ద‌వులు రాజ్య‌స‌భ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, కాంట్రాక్ట్ లు, ప్రాజెక్ట్ లు త‌మ్ముళ్లు పంచుకున్నారు. దీంతో పాటు స‌న్మానాలు కూడా చేయించుకున్నారు.
 
అలాగే అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఒక‌రికొక‌రు పొగుడుకున్నారు. ఈ నాలేగేళ్లు గుర్తురాని హ‌క్కులు ఇప్పుడు హ‌ఠాత్తుగా గుర్తుకు వ‌చ్చాయి ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి, టీడీపీ నాయ‌కుల‌కు. తాము ప్ర‌వేశ‌పెట్లే అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు కోరుతూ అన్నిపార్టీల‌కు లేఖ‌లు కూడా పంపుతున్నారు. గ‌త పార్ల‌మెంట్ స‌మావేశంలో మొద‌టిసారి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన‌ప్పుడు దాదాపు విప‌క్షాల‌న్ని మ‌ద్ద‌తు తెలిపాయి. ఇక దాన్ని కాపీ కొట్టిన చంద్ర‌బాబు టీడీపీ ఎంపీల చేత మ‌రో అవిశ్వాస నోటీసును ఇప్పించారు. గ‌తంలో అవిశ్వాసంపై పార్టీ మ‌ద్ద‌తు తెలిపితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ప‌బ్లీసిటీ స్కిట్ లో భాగంగా మ‌రోసారి మ‌ద్ద‌తు కోరుతున్న‌ట్లు సినిమా చూపించ‌డంతో అంద‌రు ఆశ్య‌ర్య‌పోతున్నారు.
 
సెప్టెంబ‌ర్ 8, 2016న అస‌లు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేదని దానివ‌ల్ల రాష్ట్రానికి ఏ ఉప‌యోగం లేద‌ని చంద్ర‌బాబు కేంద్రంతో చీక‌టి ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో తూచ్ అంటూ మ‌ళ్లీ హోదా పేరుతో డ్రామాను మొద‌లు పెట్టారు. ఏడు జిల్లాల ప్యాకుజ్ ను రైల్వే జోన్, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌, రాజ‌ధాని నిర్మాణ నిధుల‌న్నింటిని గాలికి వ‌దిలేసి త‌న‌కు పోల‌వ‌రం కాంట్రాక్ట్ ల‌కు ఇచ్చుకునే అవ‌కాశం ఇస్తే చాలని టీడీపీ నాయ‌కులు ఒప్పందం చేసుకున్నారు. 
 
అంతేకాదు 2016 సెప్టెంబ‌ర్ 10న అసెంబ్లీలో మోడీని అరుణ్ జైట్లీని అభినందిస్తూ తీర్మానాలు కూడా చూశారు. అయితే ఇక్క‌డితో ఆగ‌కుండా ఏపీలో కేంద్ర మంత్రుల‌ను ఊరూరా తిప్పి స‌న్మానాలు చేయించారు. కానీ ఇందంతా ఆత్మస్తుతి త‌ప్ప మ‌రేం కాద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతూవ‌చ్చారు. రాష్ట్రానికి జ‌రిగిని అన్యాయానికి నిర‌స‌న‌గా పార్ల‌మెంట్ లో తీవ్రంగా పోరాటాలు చేసిన వైసీపీ ఎంపీలు ఏకంగా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వారి ప‌ద‌వుల‌ను త్యాగం చేశారు. గతంలో వైఎస్ జ‌గ‌న్ పిలుపును ఇచ్చిన‌ట్లు ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే ఈ పాటికి ప్ర‌త్యేక‌ హోదా వ‌చ్చేదిక‌దా అని ప్ర‌శ్నించారు. 
 
దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఏపీకి ముడిపడి ఉన్న విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ఏరోజు చ‌ర్చించ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్పుడు ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తుతో టీఆర్ ఎస్ ను కూడా క‌లిశారు. ఉమ్మ‌డి సంస్థ‌ల విభ‌జ‌న‌పై క‌మిటీల‌ను వేసి కాల‌యాప‌న చేసిన ముఖ్య‌మంత్రి ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఒక్క‌టంటే ఒక్క సంస్థ‌ను కూడా తెలంగాణ‌ నుంచి సాధించుకోలేక పోయారు. గ‌ట్టిగా అడిగితే ఎక్క‌డ ఓట్లు కోట్లు విచార‌ణ వేగం పుంజుకుంటుందోన‌న్న భ‌యమో ఏదో తెలియ‌దు కాని అస‌లు వాటి జోలికే పోవ‌డంలేదు. 
 
రాష్ట్రాకి తాము చేసే అన్యాయం ప్ర‌జ‌ల‌కు తెలిసిపోతుంద‌ని, త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో టీడీపీ, బీజేపీతో తెగ‌దెంపులు తెంచుకుంది. ఇక ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక అయినా గ‌ట్టిగా పోరాడా అంటే టీటీడీలో బోర్డ్ లో బీజేపీ మంత్రి భార్య స‌ప్నామునుగ‌టివార్నిని స‌భ్యూరాలిగా నియ‌మించి ఇరుపార్టీల మ‌ధ్య స్నేహాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. అంతేకాదు నీతి అయోగ్ స‌మావేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌ధాని మోడీ క‌న‌బ‌డ‌గానే వంగి వంగి న‌మ‌స్కారాలు చేశారు చంద్ర‌బాబు. ఇక కేంద్ర మంత్రి నితీన్ గ‌డ్క‌రి పోల‌వ‌రానికి వ‌స్తే నిల‌దీయ‌లేక నీళ్లు న‌ములుకున్నారు టీడీపీ నాయ‌కులు. 
 
పైగా కేంద్రంతో మాకు ఎలాంటి విభేదాలు లేవ‌ని నితిన్ గ‌డ్క‌రికి ఎవ‌రో త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్నారంటూ స‌న్నాయి నొక్కుల‌ను నొక్కారు. ఇలా హ‌క్కుల సాధ‌న‌లో నాలుగేళ్లుగా చ‌తికిల ప‌డ్డ‌ చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న కో..లు రాజీనామాలు చేయ‌కుండా ఇప్పుడు కొత్త డ్రామాల‌ను ర‌క్తి క‌ట్టిస్తుండ‌టంపై ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.