స‌ర్వే షాక్....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 18:51:26

స‌ర్వే షాక్....

తెలుగుదేశం పార్టీ ఇంట‌ర్న‌ల్ స‌ర్వేల్లో దేశంలోనే కాంగ్రెస్ బీజేపీ త‌ర్వాత స్దానంలో ఉంది... ప్ర‌తీ నెలా బాబు స‌ర్వేల ద్వారా ఎమ్మెల్యేలు మంత్రుల ప‌నితీరును తెలుసుకుంటారు.. అక్షింత‌లు విమ‌ర్శ‌లు స‌ర్వేల బ‌ట్టీ వేస్తారు..ఇక ప్ర‌శంస‌లు ఎలా ఉన్నా బాబు అక్షింత‌లు వెయ్య‌కుండా ఉంటే చాలు అనుకుంటారు నాయ‌కులు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి త‌మ కంచుకోట జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణాలో ఎదురుదెబ్బ త‌గిలేలా ఉంది. తాజాగా వ‌చ్చిన‌ స‌ర్వేగాలిలో టీడీపీకి ఎదురుగాలి వీచింది.
 
సామాజికవ‌ర్గంగా తెలుగుదేశానికి కంచుకోట జిల్లాలుగా చెప్పుకోవ‌చ్చు..ఈ రెండు జిల్లాలు ఇక్క‌డ విజ‌యం వ‌రించి మెజార్టీ గెలుపుకు ప‌సుపు తివాచీ ప‌రుచుకుంటుంది తెలుగుదేశం పార్టీ. అయితే కృష్ణా గుంటూరు లో తెలుగుదేశం ప‌రిస్దితి ఇప్పుడు డైల‌మాలో ఉంది.. గ‌డ్డు ప‌రిస్దితి ని ఎదుర్కోబోతోంది అని డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. ఉభ‌య జిల్లాలో....కృష్ణాజిల్లాలో 16 సీట్లు, గుంటూరు జిల్లాలో17 సీట్లు ఉన్నాయి.. వెర‌సీ 33 సీట్లు తాజాగా ఇక్క‌డ వైసీపీ తెలుగుదేశం ప‌రిస్దితి పై తాజాగా ఓ స‌ర్వే తెలుగుదేశాన్ని టెన్ష‌న్ పెట్టిస్తోంది.
 
గ‌త ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం 11 సీట్లు గెలుచుకుంది.. ఇక్క‌డ వైసీపీ ఐదు సీట్లు గెలుచుకుంది... త‌ర్వాత జిల్లాలో ఫిరాయింపులతో పార్టీ నుంచి ఇద్ద‌రిని తెలుగుదేశంలోకి జంప్ అయ్యేలా చేసింది...ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే మైలవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, పామర్రు, తిరువూరు, విజయవాడ సెంట్రల్ లో తీవ్ర పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. అయితే టీడీపీ ఇప్పుడు ఉన్న అభ్య‌ర్దుల‌తో బ‌రిలోకి దిగితే గ‌న్న‌వ‌రం, పెన‌మ‌లూరు, విజ‌య‌వాడ ఈస్ట్‌, కైక‌లూరులో గెలిచే ప‌రిస్దితి క‌నిపిస్తోంది. అలాగే వైసీపీ గుడివాడ, మ‌చిలీప‌ట్నం,నందిగామ విజ‌య‌వాడ వెస్ట్, సెంట్ర‌ల్‌,లో వైసీపీ విజ‌యం చెందే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.
 
ఇక గుంటూరు జిల్లా విష‌యానికి వ‌స్తే గుంటూరులో 17 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి..2014 లో TDP 12 ,YCP  5 సీట్లు గెలిచాయి.. అయితే 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ కి టీడీపీకి తీవ్ర‌మైన పోటీ ఉంది అనేది ఈ సర్వేలో తేలింది.. ఇక్క‌డ టీడీపీ ఏడు, వైసీపీ ఏడుసీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది అని స‌ర్వే తేల్చింది... ఇక మ‌రో మూడు సెగ్మెంట్ల‌లో తీవ్ర‌మైన పోటీ ఉంటుంది అని స‌ర్వే తెలియ‌చేస్తోంది.
 
ముఖ్యంగా ఇక్క‌డ క‌మ్మ ఓటు బ్యాంకు టీడీపీకి ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక్క‌డ క‌న్నా బీజేపీలో చేర‌డంతో కొన్ని సీట్ల‌పై ప్ర‌తికూల ప‌రిస్దితి ఏర్ప‌డ‌వ‌చ్చు అని తెలుస్తోంది.. గుంటూరు ఈస్ట్, పెదకూరపాడు, రేపల్లే నియోజకవర్గాల్లో గట్టి పోటీ నెలకొననుంది రెండు పార్టీల మ‌ధ్య‌.. ఇక తెలుగుదేశం పార్టీ చిల‌క‌లూరిపేట‌, గుర‌జాల‌, పొన్నూరు, తాడికొండ‌,, తెనాలి, వేమూరు, వినుకొండ‌లో వైసీపీ క‌న్నా టీడీపీకి ఎక్కువ విజ‌యావ‌కాశాలు ఉన్నాయి.
 
ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ బాపట్ల, గుంటూరు వెస్ట్, మాచర్ల, మంగళగిరి, నరసరావుపేట, ప్రత్తిపాడు, సత్తెనపల్లి సీట్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలింది. మొత్తానికి ఈ స‌ర్వేలో ప‌వ‌న్ కు కాంగ్రెస్ కు ఒక్క‌చోట కూడా అవ‌కాశం లేదు అని తేలింది. ఇది ప్ర‌స్తుతం టీడీపీ వైసీపీల మ‌ధ్య ప్ర‌జ‌ల్లో ఉన్న భావాల స‌ర్వే అని సంస్ద పేర్కొంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.