వైసీపీ ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి దాడిపై టీడీపీ నో రెస్పాన్స్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 16:02:37

వైసీపీ ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి దాడిపై టీడీపీ నో రెస్పాన్స్‌

2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీ నాయ‌కుల‌కు అడ్డు ఆదుపు లేకుండా పోతోంది. తాము అధికారంలో ఉన్నాము కాబ‌ట్టి త‌మ‌దే రాజ్యం అన్న చందంగా టీడీపీ నాయ‌కులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.ఇక వారి ఆగ‌డాల‌ను చూస్తున్న టీడీపీ అధిష్టానం కూడా చూసి చూడ‌న‌ట్లుగా వ్వ‌హరిస్తోంది. దీంతో సైకిల్ నాయ‌కులు వారి గురించి ఏదైనా మాట్లాడినా, క్వ‌చ్చ‌న్ వేసినా చాలు గుంటూరు పండుమిర్చి లాగా ఎర్ర‌గా మారి ఇత‌రుల‌పై తిర‌గ బ‌డుతున్నారు. 
 
ఇక‌ ఇప్ప‌టికే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌హిళా అని చూడ‌కుండా ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడి చేశారు. అయితే ఈ ఘ‌ట‌న పై వెంట‌నే అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి కానీ అధిష్టానం మాత్రం చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. 
 
ఇక ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తాజాగా మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్‌ చేస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ కొత్త‌పేట ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి అని చూడ‌కుండా టీడీపీ అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న శాస‌న‌మండ‌లి విప్ రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం త‌న దుసురు ప్ర‌వ‌ర్త‌న‌తో జ‌గ్గి రెడ్డి పై దాడి చేశారు. సుబ్ర‌మ‌ణ్యం గోపాలపురంలో ఇసుకు ర్యాంపు అవినీతికి పాల్ప‌డ్డార‌ని స‌మావేశంలో జ‌గ్గిరెడ్డి ప్ర‌శ్నించారు. అయితే ఇందుకు ఓపిక‌తో స‌మాధానం చేప్పేది పోయి జ‌గ్గిరెడ్డిపై దాడికి దిగారు సుబ్ర‌మ‌ణ్యం. ఈ దాడిలో ఆయ‌న చేతికి అందిన దానిని తీసుకుని జ‌గ్గిరెడ్డిపై విసిరారు. దీంతో జెడ్పీ స‌మావేశం ర‌చ్చ ర‌చ్చ అయిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఈ దాడి జ‌రిగి వారాలు గ‌డిచిపోతున్నా కానీ, చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఎటువంటి చ‌ర్చ‌లు తీసుకోవ‌డంలేదు. దీంతో ఇటు వైసీపీ నాయ‌కులు అటు సాధార‌ణ ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. రాజ‌కీయాల్లో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం సాధార‌ణం కానీ స‌భా ముఖంగా దాడి చేయ‌డం ఏంట‌ని మండిప‌డుతున్నారు. ఇక ఈ దాడిపై చంద్ర‌బాబు ఎందుకు చ‌ర్య‌లు తీసువ‌డంలేద‌ని విమ‌ర్శిస్తున్నారు. 
 
మ‌రో వైపు సొంత సెగ్మెంట్ ఎమ్మెల్యేపై టీడీపీ నాయ‌కుడు దాడి చేయ‌డంతో జ‌గ్గి రెడ్డి అభిమానులు ఆగ్ర‌హంతో ఉన్నారు.అస‌లు తెలుగుదేశం పార్టీ, నాయ‌కుల‌కు కూడా ర‌క్షణ క‌ల్పించ‌లేనిది ఇటు ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ర‌క్ష‌ణ ఇస్తుంది అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.